హెల్త్ టిప్స్

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల‌ట‌.. ఎందుకంటే..?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. పొద్దున లేచి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మన ఆహార అలవాట్లు వయసుకి తగినట్లుగా మార్చుకోవడం అంతే ముఖ్యం. అందుకే కావాల్సినవి మాత్రమే తినాలి. అవసరమనుకున్నవి మాత్రమే తాగాలి. ఐతే వయసు పెరుగుతున్న కొద్దీ తినడం తగ్గించాలని చాలా మంది చెబుతారు. అది నిజమే. కానీ తాగడం ఎక్కువగా చేయాలి. వయసు ఎక్కువ అవుతున్నప్పుడు మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి.

తాజా సర్వే ప్రకారం వృద్ధులు ఎక్కువ మంచినీళ్ళు తాగాలట. శరీరంలో నీరు శాతాన్ని సరిగ్గా ఉంచడానికి మంచినీళ్ళు ఎక్కువగా తాగాలట. నీరు శాతం తక్కువ అవడం వల్ల డీహైడ్రేషన్ కి గురై, కండరాల నొప్పి, అలసట, వేడి అలసట వంటి అనేక వ్యాధులు వస్తాయని వారు అంటున్నారు. పెద్దవారికి దాహం లేనప్పుడు కూడా నీరు త్రాగాలని, డీ హైడ్రేషన్ కి కారణమయ్యే సోడా, కాఫీ మరియు ఆల్కహాల్ వంటి పానీయాలను సేవించడం తగ్గించాలని చెబుతున్నారు.

elders need to drink more water daily know why

శరీర ఉష్ణోగ్రతని నియంత్రించడంలో హైడ్రేషన్ బాగా ఉపయోగపడుతుందట. సాధారణంగా యువకులలో వ్యాయామం చేసేటపుడు అయ్యే డీ హైడ్రేషన్ శరీరంలోని వేడిని తగ్గించడమో లేదా పెంచడమో చేస్తుంది. కానీ కాస్త వయసు పైబడ్డ వాళ్ళలో అలా ఉండదు. వారు వ్యాయామం చేసినపుడు మరింత డీ హైడేషన్ కి గురవుతారు. దానివల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు గుండెపోటు వంటి వ్యాధులకి కారణమవుతాయి. అందుకే శరీరాన్ని డీహైడ్రేషన్ కి గురికానివ్వకుండా ఉండేందుకు ఎక్కువ నీళ్ళు తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు.

Admin

Recent Posts