Eye Health : నేటి తరుణంలో మనలో చాలా మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో ఇతర అవసయవాల వలె కళ్లు కూడా ఎంతో ముఖ్యమైనవి. కానీ కళ్ల ఆరోగ్యంపై తగిన శ్రద్ద తీసుకోకపోవడం వల్ల చాలా మంది కంటి చూపు మందగించడం, కంటి పొరలు, రేచీకటి వంటి వివిధ రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. కనుక కంటి ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. కంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే సాధారణ చిట్కాలను పాటించడం చాలా అవసరం. ఈ చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. కంటి ఆరోగ్యంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు తరుచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
దీంతో కంటి సమస్యలను మనం ముందుగానే గుర్తించి అవి మరింత తీవ్రరూపం దాల్చకుండా నివారించవచ్చు. కొన్ని రకాల కంటి సమస్యలు వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. కుటుంబ చరిత్రలో ఏవైనా కంటి జబ్బులు ఉంటే వాటి గురించి ముందుగానే వైద్యున్ని సంప్రదించడం అవసరం. మనం తీసుకునే ఆహారం కూడా కంటి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సిలతో పాటు ఖనిజాలు ఎక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను తీసుకోవాలి. చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా కళ్లపై నేరుగా సూర్యరశ్మి పడకుండా కాపాడుకోవాలి. సూర్యుని వచ్చే యువి కిరణాలు కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఎండలో బయటకు వెళ్లినప్పుడు కళ్లకు రక్షణ కోసం కళ్లద్దాలు ధరించడం మంచిది. వీటితో పాటు కళ్లకు విశ్రాంతిని ఇవ్వడం కూడా చాలా అవసరం.
నేటి తరుణంలో సెల్ ఫోన్స్, టివి, కంప్యూటర్ల వాడకం పెరిగిపోయింది. వీటిని ఎక్కువగా చూడడం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది. ఇక ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి. ధూమపానం ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కంటి సమస్యలు తగ్గాలన్నా అలాగే ఈ సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నా ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా తగ్గించాలి.
ఎందుకంటే ఆల్కాహాల్ కూడా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కంటిచూపు పెరగడంతో పాటు భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కళ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇన్పెక్షన్ లు రాకుండా ఉండాలంటే కళ్లు శుభ్రంగా ఉండాలి. కళ్లను చేతులతో తాకే ముందు చేతులను కడుక్కోవాలి. కళ్లను తరుచూ చేతులతో రుద్దకూడదు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.