Youthfulness : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిత్య యువరంగా ఉండాలని అనుకుంటారు. నిత్య యవ్వనంగా కనపడాలని మీరు కూడా అనుకుంటే, వీటిని పాటించండి. వీటిని కనక మీరు రోజు పాటించారంటే, కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. నిత్య యవ్వనంగా ఉండొచ్చు. రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం చాలా మంచిది. అలా లేవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర లేచిన తర్వాత పరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకోండి.
రోజులో కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయడం మంచిది. రోజుకి ఒక ఆపిల్ ని తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒక గ్లాసు నిమ్మరసాన్ని రోజు తాగితే, శారీరంలో కొవ్వు తగ్గిపోతూ ఉంటుంది. నీళ్లలో ఖర్జూరాలని నానబెట్టి, పరగడుపున రోజు మూడు తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరానికి కావలసిన ఐరన్ కూడా అందుతుంది.
రెండు అరటి పండ్లు తింటే 90 నిమిషాల్లో వ్యాయామం చేయగలిగే అంత శక్తి మీకు వస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని వాడడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. రెండు పూట్ల పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంలో వేసుకుని తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. వాముని నిప్పుల మీద వేసి ఆ పొగని పీల్చితే, జలుబు బాధ ఉండదు. ప్రతిరోజు రెండు మూడు సార్లు బీట్రూట్ ని తింటే శరీరంలో కొత్త రక్తము ఉత్పత్తి అవుతుంది. రోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్ ఉండదు.
ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి పంటి మీద రుద్దితే పళ్ళ మీద కారే రక్తం ఆగిపోతుంది. రోజు ఉప్పుని ఎక్కువగా తీసుకుంటూ ఉండకండి. ఉప్పుని బాగా తగ్గించడం మంచిది. ఆరోగ్యంగా ఉండడం కోసం పులుపు, మిర్చి, మసాలా, చక్కెర, వేపుడు పదార్థాలు తీసుకోకండి. మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. తప్పనిసరిగా రోజు పళ్ళు తోముకోవాలి. రోజు రాత్రి త్వరగా భోజనం చేయండి. ఆలస్యంగా భోజనం చేయకూడదు. రాత్రి ఆలస్యంగా పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. మానసిక ఒత్తిడి దూరం అవడానికి సంగీతం వినండి, పుస్తక పఠనం చేయండి.