నేటి రోజుల్లో పురుషులకు, స్త్రీలకు సీటు భాగంలో అధికంగా కొవ్వు పట్టేస్తోంది. దుస్తులు ఎంత టైట్ వేసినా పెరిగిపోయిన టైర్లను కనపడకుండా అణచలేక ఇంకా అధికంగా కనపడేలా చేస్తున్నాయి. ఈ రకంగా ఏర్పడే కొవ్వు చాలా గట్టిది. అంత త్వరగా కరిగేది కాదు. మరి వెనుక భాగ కొవ్వు కరిగి భారీ పిరుదులు కరగాలంటే… శరీర బరువు జీవితమంతా మోకాళ్ళపై నిలబడాల్సిందే. నిరంతరం మోయరాని బరువు మోస్తూంటే అవి చాలా బలహీనపడి నొప్పులనిపిస్తాయి కూడాను. మరి బోన్స్ లేదా ఎముకలు బలహీనపడరాదంటే ఏం చేయాలో చూడండి.
టైట్ దుస్తులు శరీర భాగాలను దాచలేవు. కనుక సౌకర్యవంతంగా లూజుగా వుండే దుస్తులు వేయండి. ఇవి ఎంతో బాగుంటాయి. లక్ష్యం పెట్టుకోండి – మొదలు పెట్టిన కొత్తలో వ్యాయామాలు చేసేయడం, మధ్యలో తగ్గించడం చివరకు పూర్తిగా నిలిపేయడంగా వుండరాదు. వ్యాయామాలు మొదలు పెట్టి క్రమేణా సమయం పెంచండి. వేగం క్రమేణా పెంచాలి. మీ అధిక బరువు కూడా ఆరోగ్యకరంగా ప్రతి వారం లేదా ప్రతి నెలా తగ్గుతూ రావాలి కాని ఒకే సారి బరువంతా తగ్గరాదు. ఆహారం – సన్నబడాలంటూ ఆహారం మానకండి. తక్కువ కేలరీలు కల ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోండి. పీచు అధికంగా వుండే పండ్లు, కూరలు, కాయ ధాన్యాలు తింటూ ఉప్పు, షుగర్ వంటి పదార్ధాలు మానేస్తే, బరువు క్రమేణా తగ్గుతుంది.
శరీర వెనుకభాగ కొవ్వు – శరీరంలోని వెనుక భాగ కొవ్వు కరగాలంటే, స్విమ్మింగ్, కిక్ బాక్సింగ్, రోయింగ్ వంటివి బాగా పనిచేస్తాయి. కొన్ని తేలికగా వెనక్కు ముందుకు వంగే వ్యాయామాలు, యోగా వంటివి కూడా వెనుక భాగ కొవ్వు తగ్గిస్తాయి. నేలపై బోర్లా పడుకోండి. పొట్ట నేలకు ఆనేట్లు వుంచి తల, కాళ్ళు వెనక్కు లేపండి. ఈ వ్యాయామం రిపీట్ చేస్తూ వుండాలి. బరువు పట్టే వ్యాయామాలు – చెక్క కుర్చీ అంచున కూర్చోండి. రెండు చేతులతో బరువులు పైకి ఎత్తండి. దీనికి జిమ్ నిపుణుల సలహాలు తీసుకోండి. స్ట్రెచస్ – వెల్లకిలా నేలపై పరుండి ఛాతీ భాగాన్ని మెల్లగా పైకి లేపండి. ఎంత లేవగలిగితే అంతే లేచి రిలాక్స్ అవండి.