పెదవులు అబద్ధం చెప్పచ్చేమో కాని పిరుదులు మాత్రం అబద్ధం చెప్పలేవట! ఎలాగో చూడండి… రిస్టు వాచ్ సైజ్ అంత పరికరాన్ని సైంటిస్టులు కనిపెట్టారు. దీన్ని ధరిస్తే….అది పెట్టుకుని నడిస్తే చాలు…మీరు అబద్ధం చెపుతున్నారో, నిజం చెపుతున్నారో అది వెంటనే చెప్పేస్తుంది. మానసికంగా వుండే భావనలు బయటపెట్టేసి అలారం మోగించేస్తుంది. దీని పేరు డైలీ డైరీగా పెట్టారు.
దీనిని ఉపయోగించి మీరు ఎపుడు జబ్బు పడేది కూడా తెలుసుకోవచ్చంటున్నారు ప్రొఫెసర్ రోరీ విల్సన్. దీనిని బెల్టుకు లేదా మడమకు కడితే చాలు సెకండ్ కు 100 కదలికలు మనసులోనివి బయటపెట్టేస్తుందిట. ప్రస్తుతం వాడుకలో వున్న లై డిటెక్టర్లు పోలీసులకు బాగా ఉపయోగపడుతూ, హార్ట్ బీట్, వంటి విషయాలలో బ్రెయిన్ చర్యలు వెల్లడిస్తున్నాయి.
ఈ పరికరం లై డిటెక్టర్లకంటే కూడా గొప్పది. అయితే, శ్వాన్ సీ యూనివర్శిటీ లో చేసిన ఈ పరిశోధనలో, డైలీ డైరీ అనే ఈ పరికరం యాక్సిలరోమీటర్లు ఉపయోగించి మనిషి నడిస్తే చాలు, పిరుదుల కదలికల ద్వారా అతని బ్రెయిన్ లోని గుట్టు రట్టు చేసేస్తుందని అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ రోరీ విల్సన్ తెలిపినట్లు ది సండే టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.