Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

జిమ్ కు వెళ్ల‌కుండానే బ‌రువు త‌గ్గండి ఇలా.. చిన్న చిన్న టిప్స్‌ను పాటిస్తే చాలు..!

Admin by Admin
February 3, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి యువతను ఎక్కువగా బాధించే విషయాల్లో ఒకటి బరువు. అవును… ఉన్నపళంగా బరువు పెరుగుతూ పోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి. అసలే బిజీ లైఫ్. వండుకోవడానికి కూడా టైమ్ ఉండదు. బయటి ఫుడ్డును ఇష్టమున్నట్టు తినేస్తాం. ఇంకేమన్నా ఉందా? బరువు పెరగమంటే పెరగమా? దానికి తోడు స్మార్ట్ ఫోన్లు, నిద్రలేమీ, వ్యాయామం చేయకపోవడం… వీటన్నింటి ఫలితమే బరువు పెరగడం. బ‌రువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. ఏం చక్కా ఇంట్లోనే ఈ ఆరు వెయిట్ లాస్ టిప్స్ పాటిస్తే చాలు. హాయిగా బరువు తగ్గొచ్చు. అయితే.. ఈ టిప్స్ ను ఏదో ఒకసారి రెండు సార్లు చేయడం కాదు.. కంటిన్యూగా చేస్తూ ఉంటేనే బరువు తగ్గుతారు అనే విషయం గుర్తు పెట్టుకోండి.

లిఫ్ట్ వద్దు… మెట్లే ముద్దు అనాలి మీరు. అవును.. మీ ఫ్లాట్.. రెండో ఫ్లోరో లేక అంతకన్నా ఎక్కువ ఫ్లోర్ లో ఉందనుకోండి. ఏం చేస్తారు. ఏదైనా పనికి బయటికి వెళ్లినా.. తిరిగి ఇంటికి వచ్చినా.. లిఫ్ట్ లోనే వెళ్తున్నారా? ఇకనుంచి ఆపేయండి. ఇంటి దగ్గరే కాదు.. షాపింగ్ మాల్స్ లో, ఆఫీసుల్లో ఎక్కడైనా సరే మెట్లు ఉపయోగించండి. ఏదో ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. అలా ఓ నెల మెట్ల మీద నడిచి చూడండి. ఓ ఐదు నిమిషాలు మెట్లు ఎక్కితే 144 కేలరీలు ఖర్చు అవుతాయట. ఓ నెల మెట్ల మీద నడిచాక.. మీకు మీరే ఫలితం చూసుకొని ఆశ్చర్యపోవడం ఖాయం.

follow these wonderful health tips for weight loss without going to gym

కొంతమందయితే కుర్చీల్లో కూర్చున్నారంటే అంతే ఇక.. గంటలు గడిచినా లేవరు. ఎందుకంటే అది లేవనీయదు కదా. ఇక ఆఫీసుల్లో కూర్చొని పనిచేసేవాళ్ల సంగతయితే చెప్పక్కర్లేదు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి ఎక్కితే మధ్యాహ్నం లంచ్ టైమ్ వరకు కూడా కుర్చీలో నుంచి లేవరు. లంచ్ తర్వాత మళ్లీ కూర్చుంటే సాయంత్రం 5 దాకా లేవరు. దీనివల్ల బరువు పెరగడమే కాదు.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. అందుకే.. కుర్చీలో కూర్చున్నాక కనీసం గంటకోసారైనా లేవాలట. గంటలో కనీసం 15 నిమిషాలైనా లేచి నిలబడాలట. ఇంకా కుదిరితే ఓ నాలుగు అడుగులు అటూ ఇటూ నడిస్తే ఇంకా మంచిదట. అలా చేస్తే 35 కేలరీలు ఖర్చవుతాయట.

కొంతమందికి అయితే టైమ్ పాస్ కావట్లేదు అంటూ తెగ ఆందోళన చెందుతుంటారు. అటువంటి వాళ్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలు. అటు ఇల్లు క్లీన్ అవుతుంది. టైమ్ కూడా గడిచిపోతుంది. దాంతో పాటు మీ ఒంట్లోని కేలరీలు కూడా ఖర్చు అవుతాయి. చూయింగ్ గమ్స్ ఎప్పుడైనా నమిలారా మీరు. అవి కూడా మంచిదేనట. కాకపోతే షుగర్ లెస్ చూయింగ్ గమ్స్ అయిటే బెటర్ అని అంటున్నారు నిపుణులు. చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా బరువు తగ్గుతారట. ఓ గంట సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల దవడ కండరాలు కదిలి… 11 కేలరీలు ఖర్చు అవుతాయట. మీకు కారు, బైక్, సైకిల్.. ఇలా ఏ వాహనం ఉన్నా… వాటిని మీరే శుభ్రం చేసుకోండి. ఉదయం లేవగానే ఓ అర్ధగంట వాటిని శుభ్రం చేసేందుకు కేటాయిస్తే… మీ ఒంట్లోని అనవసర కొవ్వు కరుగుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. ఏదైనా ఓ వాహనాన్ని గంట సేపు శుభ్రం చేస్తే 280 కేలరీలు ఖర్చవుతాయట.

మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? వాళ్ల అల్లరి తట్టుకోలేకపోతున్నారా? అయితే.. పిల్లలతో కాసేపు సరదాగా ఆడుకోండి. వాళ్లతో సరదాగా కాసేపు గడపండి. అప్పుడు మీరు రిలాక్స్ అవడంతో పాటు.. మీ కేలరీలు కూడా తగ్గుతాయి. కాకపోతే.. మీరు పిల్లలతో ఇంట్లో గడపడం కాదు.. బయటికి వెళ్లాలి. అలా సరదాగా పిల్లలను పార్క్ కు తీసుకెళ్లి.. వాళ్లతో పాటు ఆడుకోండి. అప్పుడు వద్దన్నా.. మీ ఒంట్లోని కొవ్వు కరుగుతుంది.

Tags: gymweight loss
Previous Post

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే పూడ్చడమో, కాల్చడమో చేస్తాం..కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారో తెలుసా..?

Next Post

50 ఏళ్ల‌కు పైబ‌డిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.