రోజూ మనం తినే ఆహార పదార్థాలు, తాగే పానీయాలతోపాటు పాటించే జీవనవిధానం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. మద్యం ఎక్కువగా సేవించేవారితోపాటు కొవ్వు పదార్థాలను అధికంగా తినేవారిలో, బరువు ఎక్కువగా ఉండే వారిలో, డయాబెటిస్, గుండె జబ్బులు ఉండేవారిలో లివర్‌లో కొవ్వు చేరుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వచ్చేది. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య. మద్యం కాకుండా ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది.
అయితే ఫ్యాటీ లివర్‌లో ఏ తరహా సమస్య వచ్చినా సరే అందుకు బీట్‌రూట్ చక్కగా ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అవి లివర్‌ను క్లీన్ చేస్తాయి. బీట్‌రూట్‌ను తినడం లేదా బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల లివర్‌లోని ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి. దీంతో బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ క్రమంలో లివర్‌లోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ లో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్ వాపులు తగ్గుతాయి.
రోజూ ఉదయాన్నే పరగడుపునే బీట్ రూట్ జ్యూస్‌ను తాగుతుంటే లివర్ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుంది. దెబ్బ తిన్న లివర్ తిరిగి రిపేర్ అవుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్‌ను ఉదయం తాగలేకపోతే మూడు పూటలా భోజనానికి ముందు నాలుగైదు బీట్ రూట్ ముక్కలను తినేలా ప్లాన్ చేసుకోండి. దీంతో లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు బీట్‌రూట్‌ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇక లివర్‌లో ఉన్న కొవ్వు కరిగేందుకు బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్‌ను ఆ జ్యూస్ క్లీన్ చేస్తుంది. కనుక బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగడం మంచిది.
ఒక బీట్ రూట్ ను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. అనంతరం వచ్చే జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. ఈ జ్యూస్‌ను ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. లేదా భోజనానికి ముందు మూడు పూటలా బీట్‌రూట్ ముక్కలను తినాలి. రోజూ ఇలా చేస్తే లివర్ క్లీన్ అవుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365