తమలపాకులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!

తమలపాకులను పాన్‌ రూపంలో చాలా మంది నిత్యం తింటుంటారు. దీన్ని అంతలా తినడం వల్ల అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తమలపాకులను నిత్యం స్వల్ప మోతాదులో వాడితే వాటితో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of betel nut leaves

దంత సమస్యలు

తమలపాకులు దంతాలు, నోటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి భోజనం చేశాక ఒక తమలపాకును అలాగే నమిలి తినాలి. దీంతో నోటి దుర్వాసన ఉండదు. రాత్రి పూట మన నోట్లో సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఏర్పడుతాయి. ఈ క్రమంలో తమలపాకులను తింటే ఆ క్రిములు నశిస్తాయి. అలాగే దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. అవి దృఢంగా మారుతాయి. దంత క్షయం సమస్య తగ్గుతుంది. అయితే తమలపాకులను కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

ఇన్ఫెక్షన్లు, గాయాలు, పుండ్లు

తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి గాయాలు, పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను నయం చేస్తాయి. వాటిపై తమలపాకులను కట్టులా కడితే ప్రయోజనం ఉంటుంది. తమలపాకుల్లో కాల్షియం, విటమిన్‌ సి, నియాసిన్‌, కెరోటిన్‌, థయామిన్‌ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.

డిప్రెషన్‌

తమలపాకులు యాంటీ డిప్రెసెంట్‌ డ్రగ్‌లలా పనిచేస్తాయి. అంటే వీటిని తింటే డిప్రెషన్‌ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉండవు.

ఆస్తమా

తమలపాకులను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా చిన్నప్రేగులు మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అధిక బరువు

తమలపాకులను తినడం వల్ల జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం తగ్గుతుంది. తమలపాకుల్లో ఉండే ఫైబర్‌ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

తలనొప్పి

తలనొప్పి బాగా ఉన్నవారు ఒక తమలపాకును తిని చూస్తే మంచిది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల్లో ఉండే శీతలపరిచే గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి.

 

Share
Admin

Recent Posts