దాదాపుగా అనేక రకాల కూరగాయలను చాలా మంది తింటుంటారు. కానీ చేదుగా ఉండే కాకరకాయలను తినేందుకు కొందరు వెనుకడుగు వేస్తుంటారు. కాకరకాయలు చేదుగా ఉంటాయి నిజమే. కానీ వాటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే కాకరకాయలను తినలేమని అనుకునేవారు వాటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలి ? దాంతో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ టీని తయారు చేయడం చాలా సులభమే. కాకరకాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి. అవి ఎండిన తరువాత ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఆ ముక్కలను వేయాలి. అనంతరం ఆ నీటిని మరిగించాలి. 10-15 నిమిషాల పాటు మరిగాక ఆ టీని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరస్ కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో కాకరకాయ టీని తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. కాకారకాయ టీని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
3. కాకరకాయ టీని తాగడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
4. కాకరకాయ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
5. కాకరకాయాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల వాటితో టీ తయారు చేసుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365