పూర్వం చాలా మంది శనగలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. కానీ ఈ అలవాటు మరుగున పడిపోయింది. మన పెద్దలు ఒకప్పుడు ఇలాగే చేసేవారు. రాత్రంతా శనగలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినేవారు. దీంతో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందేవారు. నానబెట్టిన శనగలను ఉదయాన్నే పరగడుపునే తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఒక కప్పు అంటే దాదాపుగా 50 గ్రాముల శనగల్లో పిండి పదార్థాలు 15 గ్రాములు, ఫైబర్ 5 గ్రాములు, ప్రోటీన్లు 10 గ్రాములు లభిస్తాయి. అలాగే ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు కూడా వాటిలో ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
2. రోజూ బాదంపప్పు తినలేమని అనుకునేవారికి శనగలు ప్రత్యామ్నాయ ఆహారం అని చెప్పవచ్చు. బాదం పప్పు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కానీ శనగల ఖరీదు తక్కువ. పైగా పోషకాలు ఎక్కువ. అందువల్ల బాదంపప్పుకు బదులుగా వీటిని ఉదయాన్నే తినవచ్చు. శనగలను తినడం వల్ల పురుషుల్లో నపుంసకత్వ సమస్య తగ్గుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శనగలను తేనెతో కలిపి తింటే ఎక్కువ ఫలితం ఉంటుంది.
3. శనగలను నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
4. శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. వీటిని తినడం వల్ల క్యాలరీలు కూడా తక్కువగానే లభిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. అధికంగా ఆహారాలను తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో బరువు సులభంగా తగ్గుతారు. శనగలను రోజూ తినడం వల్ల స్థూలకాయం బారిన పడే అవకాశాలు 53 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల రోజూ శనగలను తింటే బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
5. పొట్టుతో కూడిన శనగల్లో మాంగనీస్, థయామిన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల శనగలను తింటే పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. ఉదయం మనకు శక్తి బాగా అవసరం అవుతుంది. కనుక శనగలను తింటే శక్తిని బాగా పొందవచ్చు.
6. శనగల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవు. కాబట్టి శనగలు డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయని చెప్పవచ్చు. వారు రోజూ వీటిని తింటే మంచిది. శనగల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్లు డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రోజూ శనగలను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజూ వీటిని తింటే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365