హెల్త్ టిప్స్

చిక్కిపోయి నీర‌సంగా మారుతున్న‌వారు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు బ‌రువును వేగంగా కోల్పోతుంటారు. ఎంత తిన్నా బ‌రువు పెర‌గ‌రు. పైగా చిక్కిపోతూ బ‌ల‌హీనంగా మారుతుంటారు. అయితే అందుకు కార‌ణాలు ఏమున్నా.. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో బ‌రువు బాగా పెరుగుతారు. దృఢంగా, ఆరోగ్యంగా మారుతారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

home remedies to get rid of weakness and become strong

1. ఆక‌లి బాగా పెరిగేందుకు, బ‌రువును పెంచేందుకు శొంఠి, అల్లం వంటివి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవాలి. అల్లం ర‌సం తాగాలి. పాల‌లో శొంఠి క‌లుపుకుని తాగాలి. దీంతో బ‌లం క‌లుగుతుంది.

2. రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంలో తోడుపెట్టి ఉదయాన్నే తినాలి. దీంతో చిక్కిపోతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఆ తోడు అన్నంలో క‌లిపి తింటే తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే బ‌లం చేకూరుతుంది.

3. పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని దంచిన పొడిని టీస్పూన్‌ మోతాదులో తీసుకొని పాలలోవేసి చ‌క్కెర‌ కలిపి తాగుతుండాలి.

4. బాదం, పిస్తా, జీడిపప్పు, దూలగొండి విత్త‌నాలు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, సుగంధిపాల ల‌ను సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని టీస్పూన్ మోతాదులో తీసుకుని పాలలో కలిపి తాగాలి. దీంతో చిక్కిపోతున్న వారు శక్తిమంతుల‌వుతారు. రోజూ రెండు పూటలా ఇలా తాగాల్సి ఉంటుంది.

5. శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గుతాయి. రక్త పుష్టి కలుగుతుంది. బ‌లం చేకూరుతుంది. దృఢంగా మారుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts