Fat : నేటి తరుణంలో అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇతర అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. అయితే అధికంగా ఉండే బరువును తగ్గించుకునేందుకు మనకు అనేక రకాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తమకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి బరువు తగ్గాలని చూస్తున్నారు. అయితే మీకు తెలుసా..? అన్ని టిప్స్ అందరికీ పనికి రావు, కేవలం కొందరికి మాత్రమే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే అధిక బరువు ఉన్న వారు ఎవరైనా తమకు నిర్దిష్టమైన భాగంలో ఉన్న కొవ్వును బట్టి అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరికి శరీరం కింది భాగంలో ఎలాంటి కొవ్వు ఉండదు. కింది భాగం స్లిమ్‌గానే ఉంటుంది. కానీ పై భాగం మాత్రం కొవ్వు చేరి లావుగా అవుతుంది. అవసరం ఉన్న ఆహారం కన్నా అధికంగా తింటే ఇలా కొవ్వు పేరుకుపోతుంది. అయితే వీరు కొవ్వు కరిగేందుకు ఏం చేయాలంటే.. ఎరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను నిత్యం కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. చక్కెర ఉండే తీపి పదార్థాలను తినరాదు. ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి వాటి వల్ల కొందరికి బాన పొట్ట వస్తుంది. ఇలాంటి వారు ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించుకునే యోగా, వ్యాయామాలు చేయాలి. గ్రీన్ టీ వంటివి రోజూ తాగుతుంటే బాన పొట్ట కరుగుతుంది.
గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తినే వారికి శరీరం పై భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి వారు గ్లూటెన్ లేని ఫుడ్స్ తింటే మంచిది. కొవ్వు, అధిక బరువును తగ్గించుకోవచ్చు. వాకింగ్, యోగా వంటి వ్యాయామాలు చేసినా ఈ కొవ్వు కరుగుతుంది. వీరు ఉదయం అల్పాహారం మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. మానేయరాదు. కొందరికి శరీరం మొత్తం బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ఎప్పుడూ ఉబ్బి కనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే.. మద్యం సేవించడం వల్ల ఇలా పొట్ట ఉబ్బుతుంది. కనుక వీరు మద్యపానం మానేయాల్సి ఉంటుంది. అలాగే రోజూ తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
కాళ్లు, నడుం దగ్గర కొవ్వు ఉండడం అంటే.. ఎక్కువగా మహిళలకు ఇలాంటి సమస్య వస్తుంది. గర్భంతో ఉన్న సమయంలో ఇలా మహిళలు మారుతారు. వీరు ఆహారంలో ఉప్పును తగ్గించాలి. దీంతో ద్రవాలు కరిగిపోతాయి. బరువు తగ్గుతారు. అలాగే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగాలి. ఒక్క చోటే కూర్చుని ఉండరాదు. రాత్రి సమయంలో కాళ్ల కింద దిండ్లు పెట్టుకుని నిద్రించాలి. శారీరక శ్రమ చేయని వారికి ఇలా పొట్ట, వీపు భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. వీరు రోజూ తగినంత నిద్ర పోవాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. రన్నింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు రోజూ చేయాలి. దీంతో అధిక కొవ్వు, బరువు తగ్గిపోతాయి. ఇలా శరీరంలో పలు భాగాల్లో ఉన్న కొవ్వుకు భిన్నమైన మార్గాలను పాటించాలి. అప్పుడే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.