Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

హై హీల్స్ ( ఎత్తు మడమల చెప్పులు) వేసుకునే వారికి ఈ విషయాలు తప్పక చెప్పాల్సిన బాధ్యత మనది..!

Admin by Admin
April 26, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి తరుణంలో ఎత్తు మడిమల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజమైన పొజిషన్‌ను మారుస్తాయి. శరీరానికి చెందిన ఎక్కువ బరువును మడ‌మలపై మోపడం వల్ల పాదం ముందు భాగంపై అధికంగా ఒత్తిడి పడుతుంది. శరీర బరువుంతా సమానంగా పంపిణీ అయ్యే వ్యవస్థను ఎత్తు మడ‌మల చెప్పులు దెబ్బ తీస్తాయి. దీని వల్ల పొట్ట ముందుకు, పిరుదులు వెనక్కి వాటంతట అవే కదులుతాయి. దీంతో వెన్నెముక కింది భాగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని కోల్పోతుంది.

ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు వస్తాయి. అసహజమైన పాదం ఆకృతి వల్ల కాలి పిక్కలు బాగా నొప్పి పుడతాయి. హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వేసుకుంటే ఏకిల్స్ టెండన్స్ (Achilles tendons) అనే రుగ్మతకు లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఆ చెప్పులకు బదులుగా సాధారణ చెప్పులు వేసుకున్నా పాదం నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. మామూలుగా నడిచినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. పాదంపై ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. రోజూ హై హీల్స్ చెప్పులను ధరించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రధానంగా మడ‌మల వద్ద ఉండే కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి.

if women who are wearing high heels must know this

హై హీల్స్ చెప్పులతో బ్యాక్ పెయిన్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చెప్పులు శరీర గురుత్వ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాలి వేళ్లు నిస్సత్తువగా, స్తబ్దుగా మారుతాయి. అయితే దీన్ని పట్టించుకోకుండా అలాగే హై హీల్స్ చెప్పులను వాడితే అది కాలి వేళ్లలోని నరాలను శాశ్వతంగా దెబ్బ తీస్తుంది. హై హీల్స్ చెప్పుల వెనుక భాగంలో పదునుగా ఉండే స్ట్రిప్ పాదంపై 30 శాతం అదనపు ఒత్తిడిని కలగజేస్తుంది. ఇవి ఎంత ఎత్తుగా ఉంటే దాని వల్ల అంత అనారోగ్య సమస్య కలుగుతుంది. ప్రధానంగా మడ‌మలు, పిక్కలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. హై హీల్స్ చెప్పులను ఎక్కువగా వాడితే శరీర వెన్నెముక తన సహజమైన షేప్‌ను కోల్పోతుంది. దీంతో బ్యాక్ కొద్దిగా వంగినట్టు అవుతుంది. దీని వల్ల శరీర ఆకృతిలో తేడా వస్తుంది. హై హీల్స్ వల్ల పాదం కండరాలు ఎక్కువగా దెబ్బ తింటాయి. కాళ్లు నొప్పులకు, బెణుకులకు గురవుతాయి. సో, ఫ్యాషన్ సంగతి పక్కన పెడితే వీలైనంత వరకు వీటిని ధరించకపోవడమే ఉత్తమం.

Tags: High Heels
Previous Post

మీ బ్లడ్ గ్రూప్ ను బట్టి.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెల్సుకోండి..

Next Post

శరీరంపై అసహ్యంగా కనిపించే పులిపిరికాయలను ఇలా తొలగించండి..

Related Posts

వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

June 12, 2025
హెల్త్ టిప్స్

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 12, 2025
హెల్త్ టిప్స్

ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు..!

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!