ఇష్టమైన కలర్ ను బట్టి మీ మనస్తత్వం చెప్పే మెజర్ మెంట్స్ చాలానే ఉన్నాయి.. మీకు నచ్చే సినిమాని బట్టి, మీరు మెచ్చే ప్రదేశాన్ని బట్టి కూడా మీ బిహేవియర్ ను అంచనా వేసే అంజనాలు కూడా చాలా కనబడతాయ్. ఇది 100 శాతం నిజమా అంటే చెప్పలేము కానీ…. కొద్దో గొప్పో మన టేస్ట్ కు, మన మనస్తత్వానికి దగ్గరగా ఉంటాయనేది మాత్రం నమ్మక తప్పని నిజం. ఇప్పుడు ఓ కొత్త పరిశోధన అందరినీ ఆకర్షిస్తోంది. రక్తవర్గాన్ని( బ్లడ్ గ్రూప్) బట్టి మీ బిహేవియర్ ను చెప్పే సరికొత్త రీసెర్చ్ ఇది.. మీరూ ట్రై చేయండి మీ మనస్తత్వం ఎలాంటిదో…..!!
ఏ పాజిటివ్ (A+). మీలో ప్రవహించేది ఈ గ్రూప్ రక్తమా అయితే మీరు మంచి లీడర్ షిప్ క్వాలిటీ కలవారు. అందరిని ఇట్టే తమవైపు తిప్పుకోగలరు. అలాగని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్లాన్ వేసుకోవాలా అని మాత్రం మమ్మల్ని అడగకండి!
ఎ నెగెటివ్ (A-). మీది ఈ బ్లడ్ గ్రూపా.. అయితే కొండల్ని పిండి చేసేంత కష్టపడే తత్వం కలవారు మీరు. కష్టానే నమ్ముకునే నేచర్ మీ సొంతం.
బి పాజిటివ్ (B+). ఈ వర్గం వాళ్లయితే, సాక్రిఫైజ్ చేయడంలో ముందుంటారు. త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్ లా, శిబి చక్రవర్తికి జిరాక్స్ కాపీలా ఉంటుంది వీళ్ల స్వభావం.
బి నెగెటివ్(B-). మీ బ్లడ్ గ్రూప్ ఇదైతే..మీలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ, సెల్పిజం ఉంటుంది, కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓ పాజిటివ్…(O+) వీరు ఐన్ స్టీన్ కు వారసుల లాంటి వారు, వీరి మైండ్ శంకర్ రోబో కన్నా యమఫాస్ట్.. వీరిని అర్థం చేసుకోవడం ఆషామాషి విషయం కాదు.
ఓ నెగెటివ్..(O-) ఉలకరూ .పలకరూ అంటారే ఆ టైప్ ఈ రక్త వర్గం వారు.. రిజర్వ్ డ్ గా ఉంటారు. కవిత్వాలు రాసుకుంటూ, బాత్ రూమ్ లో పాటలు పాడుకుంటూ, తమలో తామే గొణుక్కునే రకం వీరు.
ఎబిపాజిటివ్ (AB+). ఇతరులకు సహాయం చేయబడును అనే బోర్డ్ మెడలో ఉండదు, కానీ అంతకంటే ఎక్కువగానే సహాయం చేస్తారు పక్కవాళ్లకి. హెల్ప్ చేయడం కోసం పోటీపడే తత్వం వీరిది.
ఎబి నెగెటివ్ (AB-). మూడు చేపల కథలో ప్రాప్తకాలజ్ణుడి టైపు.. సందర్భానికి తగినట్టు వ్యవహరిస్తారు. లాభం లేనిది గడ్డిపోచను కూడా పక్కన పెట్టరు ఈ టైపు బ్లడ్ గ్రూప్ వాళ్ళు..
కేవలం ఇది కొంత మందిని పరిగణలోకి తీసుకొని చేసిన రీసెర్చ్ మాత్రమే గమనించగలరు. అందరి స్వభావాలు అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉండాలి అనే రూల్ ఏమీ లేదు, కానీ మెజారిటీ ప్రజలు ఇలా ఉండొచ్చు.