మద్యం సేవించడం అన్నది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ముడ్డి కిందకు 18 ఏళ్లు వచ్చిన వారు.. ఆ మాటకొస్తే కొందరు టీనేజ్‌లో ఉన్న వారు కూడా మద్యం సేవిస్తున్నారు. ఇందుకు అమ్మాయిలు కూడా మినహాయింపు కాదు. వైన్ షాపులకు వెళ్లడం మద్యం తెచ్చుకోవడం, తాగడం. ఇక వేరే ఏ పని ఉండడం లేదు. అయితే డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఎప్పుడో ఒకసారి ఒక పెగ్గు మద్యం సేవిస్తే ఒకే. కానీ మద్యం విపరీతంగా సేవిస్తే మాత్రం తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే..
ఖాళీ పొట్టతో తాగకండి – లిక్కర్ తాగే ముందు పొట్టలోకి కొంత తినండి. కడుపు నిండేది, పోషక విలువలనిచ్చేది తినాలి. తింటే…మీరు తీసుకునే ఆల్కహాల్ పొట్ట లైనింగ్ ని దెబ్బతీయకుండా వుంటుంది. మందు పార్టీకెళ్ళేముందు, కొద్దిపాటి ఆహారం తప్పని సరి. అరటిపండు – తాగుడు సెషన్ వేసే ముందు రెండు అరటి పండ్లు తినేయండి. మీ పొట్ట లోపలి సున్నితమైన లైనింగ్ కు అది పేస్ట్ లా పనిచేసి దానిని కాపాడుతుంది. అంతేకాదు మీకు తక్షణ శక్తినిస్తుంది. బలహీనమై డ్రింక్ మధ్యలోనే పడకుండా చేస్తుంది. తాగుతూ తినండి – తాగుతూ, తాగుతూ మధ్యలో పడిపోయారంటే, మీరు బలహీనమయ్యారనే లెక్క. మరింత తాగితే, వాంతులే, శక్తి అంతా పోతుంది. కనుక డ్రింక్ కు ముందు తినటమే కాదు. డ్రింక్ చేసేటపుడు కూడా సలాడ్ల వంటివి తింటూ వుండండి. లిక్కర్ తో కలిపి హై ఎనర్జీ డ్రింకులు కూడా తీసుకోవచ్చు.
తాగేటపుడు, స్వీట్ గా వుండే ఆహారాలు, చాక్లెట్, డెసర్ట్స్ లాంటివి తీసుకోకండి. వీటిలో షుగర్ అధికం. విటమిన్ సి కల నిమ్మ, లేదా పెరుగు లేదా పులుపైనది ఏదైనా తినండి లేదా తాగండి. వివిధ రకాల లిక్కర్లు కలిపి తాగకండి. అవి బయటకు వచ్చేస్తాయి. విస్కీ మొదలెడితే అదే తాగండి. డ్రింక్ అంతా అర్ధగంటలో పూర్తి చేయకండి. తినటం, తాగటం, తినటం, తాగటం ప్రక్రియగా కొంత సమయం బాగా తీసుకోండి. స్మోకింగ్ – తాగేటపుడు స్మోకింగ్ చేయకండి. అసలైన కిక్ రాకుండానే మిమ్మల్ని అవుట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఈ డ్రింకింగ్ చిట్కాలు పార్టీలో పాటించి ఆనందించండి.