Cool Drinks : మనకు దాహం వేయడం చాలా సహజం. దాహం వేసినప్పుడు మంచి నీటిని తాగాలి. కానీ కొందరు దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్స్ ను బాటిల్స్ మీద బాటిల్స్ తాగుతూ ఉంటారు. వేసవి కాలంలో వీటిని మరీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే కొందరి ఇండ్లల్లో ఫ్రిజ్ లో ఎప్పుడూ కూల్ డ్రింక్స్ ను నిల్వ చేసుకుంటూ ఉంటారు. మనం తాగేది కాకుండా మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇస్తూ ఉంటాం. అయితే ఈ కూల్ డ్రింక్స్ మన దాహాన్ని తీర్చిన అప్పటికప్పుడు ఉత్తేజాన్ని ఇచ్చిన తరువాత మాత్రం వీటి ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. ఈ విషయం మనలో చాలా తక్కువ మందికే తెలుసు.
ఇవి మన ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కూల్ డ్రింక్స్ గురించి కొన్ని భయంకరమైన నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు 50 టన్నుల ఆహారాన్ని మన దంతాలతో నమిలి తీసుకుంటూ ఉంటాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలిన అరగని ఈ పళ్లను ఒక కూల్ డ్రింక్ నెల తిరగకుండానే కరిగించేస్తుంది. ఊడిపోయిన పళ్లను ఒక కూల్ డ్రింక్ బాటిల్ లో వేసి నెలరోజులు ఆగి చూడండి. అప్పుడు నిజం మీకే తెలుస్తుంది. మనం రోజూ ఉపయోగించే సింక్ బాగా మరకలు పడి ఎండిపోయినప్పుడు దానిపై యాసిడ్ పోకుండా కాస్త కూల్ డ్రింక్ పోసి 5 నిమిషాల ఆగి శుభ్రం చేయండి. అది చక్కగా యాసిడ్ లా పని చేసి సింక్ ను శుభ్రం చేస్తుంది. యాసిడ్ తో సమానమైన ఈ కూల్ డ్రింక్స్ ను మనం తాగకూడదు.
పిల్లలకు కూడా ఇవ్వకూడదు. కూల్ డ్రింక్స్ లో ఫాస్పరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎముకల్లో క్యాల్షియం తగ్గితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముకలు విరిగిపోతాయి. అనగా ఎముకలు వాటి ధృడత్వాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఇలా జరగకపోయిన కొన్ని రోజులకు శరీరం ఏ పనులకు సహకరించదు. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అదేవిధంగా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం కూడా ఉంది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా వీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే మనం ఆక్సిజన్ ను పీల్చుకుని కార్బన్ డై యాక్సైడ్ ను వదులుతూ ఉంటాం. ఈ కార్బన్ డై యాక్సైడ్ అనే విష వాయువును కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాడుతూ ఉంటారు. వీటిలో విష రసాయనాలు అనేకం కలిసి ఉంటాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంతగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని నిపుణులు చెబుతున్నారు.