హెల్త్ టిప్స్

హ్యాంగోవర్ రావొద్దంటే ఇలా చేయండి..!

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది. చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆ సమయంలో శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడు పని తీరు మందగిస్తుంది.

నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. దీని ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. చివరి దశ మరణం వైపు అడుగులు వేయటం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు అంత తీవ్రంగా ఉంటాయి. రక్తంలో ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది.

if you do not want to get hang over follow this tip

తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటే కాసేపటికి స్పృహ లేకుండా పోతుంది. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. శరీరంలోని ప్రతి అణువుకూ వెళ్తుంది. కొందరికి మత్తు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా వస్తుంది. ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. మొదట మద్యం మితంగానే తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోతే రానురాను అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది.

అతిగా మద్యం తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.మద్యం ఎక్కువ తాగితే వాంతులు రావచ్చు.వాంతులు వస్తున్నా ఆగకుండా అదే పనిగా మద్యం తాగడం మంచిది కాదు. మద్యం మత్తు ఎక్కువైతే హ్యాంగోవర్ చాలా ఇబ్బంది పెడుతుంది.తల పట్టేసి చికాకు కలిగిస్తుంది. దీని నుండి బయటకి వచ్చేందుకు పడుకునే ముందు ఓ గ్లాసు నీళ్లు తాగితే హ్యాంగోవర్‌ను కాస్త తగ్గించేందుకు వీలుంటుంది.

Admin