లావెక్కి మీ ఫేవరెట్ దుస్తులు పక్కన పడేశారా? అవసరం లేదు! కొన్ని చిట్కాలు పాటించి రెండే రెండు వారాల్లో వాటిని ధరించేయండి. ముందుగా టైట్ అయిన దుస్తులు వేయండి. మీ శరీరంలోని ఏ భాగాలవద్ద అవి టైట్ అయ్యాయో తెలుసుకోండి. పొట్టవద్దా, నడుమా, వక్షోజాలవద్దా, తొడల భాగమా లేక చేతులా అనేది చెక్ చేయండి. ఇక మీ ఆహారంలో పోషకాలు కల కూరలు, పండ్లు చేర్చండి. వేపుడులు, బేకరీ జంక్ తినకండి. ఆకలి నియంత్రించటానికి ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారం తినండి.
స్వీట్లు, రైస్, మొదలైన కార్బో హైడ్రేట్ పదార్ధాలు వదలండి. కేలరీలు అధికంగా లేని తేలిక భోజనం చేయండి. ఆహారం సమయానికి తీసుకోండి. నిద్రకు 3 లేదా 4 గంటల ముందు ఆహారం తీసుకోండి. మీ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అధికంగా కడుపు నింపేదిగా వుండాలని గ్రహించండి. పాల ఉత్పత్తులలో తక్కువ కొవ్వు వుండేలా చూడండి. పండ్ల రసాలు తరచుగా తీసుకోండి.
ప్రతి భోజనం తర్వాత నిమ్మరసం కలిపిన ఒక గ్లాసు వేడినీరు తాగండి. 7. నడక, జాగింగ్ వంటివి కాకుండా ఎరోబిక్ వ్యాయామాలు రోజుకు రెండుసార్లు చేయండి. ఆల్కహాలు, కూల్ డ్రింకులు వదిలేయండి. ఈ చర్యలు పాటిస్తే, రెండు వారాలలో, మీరు టైట్ అయ్యాయంటూ పక్కన పడేసిన మీ ఫేవరెట్ దుస్తులు మళ్ళీ మరోమారు ధరించి ఆనందించవచ్చు.