Yoga : ప‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకోవాలంటే.. రోజూఈ ఆస‌నాల‌ను వేయండి..!

Yoga : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. నిద్ర పోవడం కూడా అంతే అవసరం. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి.

Yoga  follow these two asanans daily for deep sleep

అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారికి సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటి వారు కింద తెలిపిన యోగాసనాలను వేయడం వల్ల గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. రోజూ ఈ ఆసనాలను ప్రాక్టీస్‌ చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే..

అశ్వ సంచలనాసనం

ఈ ఆసనం వేసేందుకు ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. తరువాత అర చేతులను నేలపై ఉంచాలి. చేతులపై బలం ఉంచి అలాగే పైకి లేవాలి. కుడి మోకాలును ముందుకు చాపాలి. మోకాలిపై కూర్చుని పైకి లేచి వెన్నును నిటారుగా ఉంచాలి చేతులతో నమస్కారం పెట్టాలి. ఎడమకాలును నేలపై అలాగే ఉంచాలి. ఆ కాలి మోకాలిని నేలకు ఆనించాలి. ఇలా కొంత సేపు ఉండి ఇంకో కాలితో కూడా ఇలాగే చేయాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని రోజూ వీలున్నంత సేపు చేయాలి.

బాలాసనం 

నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి ఎత్తి ముందుకు వంగాలి. రెండు అర చేతులను నేలపై ఉంచాలి. తుంటి భాగాన్ని పాదాలపై ఉంచాలి. ఈ భంగిమలో వీలున్నంత సేపు ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ చేయాలి.

ఈ విధంగా ఈ రెండు ఆసనాలను రోజూ వేయడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.

Share
Editor

Recent Posts