Jaggery Tea For Weight Loss : మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బెల్లం కూడా ఒకటి. బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ప్రస్తుత కాలంలో బెల్లం వాడకం పెరిగిందనే చెప్పవచ్చు. తీపి వంటకాల తయారీలో పంచదారను వాడడం వల్ల అనేక అనారోగ్య ససమస్యలను చవి చూడాల్సి వస్తుంది. దీంతో చాలా మంది పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడుతున్నారు. బెల్లాన్ని వాడడం వల్ల మనం చేసే పదార్థాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటాయి. బెల్లంతో తరుచూ చేసే తీపి పదార్థాలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే బెల్లం టీ ని కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం టీ అనగానే మనలోచాలా మంది సాధారణ టీ లో పంచదారకు బదులుగా బెల్లం వేయడం అనుకుంటారు. కానీ ఈ టీ అలా తయారు చేయరు.
ఈ బెల్లం టీ ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బెల్లం టీ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే ఈ టీనిఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బెల్లం టీని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 2 లేదా 3 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లేదా 5 దంచిన మిరియాలు, 10 తులసి ఆకులు, అర ఇంచు ముక్క దంచిన అల్లం వేసి నీటిని మరిగించాలి. నీరు మరిగిన తరువాత ఒక టీ స్పూన్ టీ పౌడర్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసి మరిగించాలి. దీనిని బెల్లం కరిగే వరకు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టి తాగాలి. ఇలా తయారు చేసిన బెల్లం టీని ఉదయం పూట పరగడుపున లేదా అల్ఫాహారం చేసిన అరగంట తరువాత తీసుకోవాలి.
ఇలా బెల్లం టీ ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ టీ ని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలిగిపోతుంది. బరువు తగ్గడంలో కూడా ఈ టీ మనకు సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియల రేటును పెంచి క్యాలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చేయడంలో బెల్లం టీ మనకు దోహదపడుతుంది. ఈ టీని తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో దోహపడుతుంది. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు అందుతాయి. కనుక శరీరం యొక్క పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా బెల్లం టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.