Garlic : వెల్లుల్లిని నిత్యం మనం వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లిని ఎక్కువగా కూరల్లో వేస్తుంటారు. అయితే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకుని ఉదయాన్నే పరగడుపునే పచ్చిగా అలాగే తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ కొందరు మాత్రం వెల్లుల్లిని అలా తినరాదు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని అలా తినకపోవడమే మంచిది. మరి ఎవరెవరు వెల్లుల్లిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. చర్మ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే అలినేజ్ అనే ఎంజైమ్ చర్మంపై దద్దుర్లు వచ్చేలా చేస్తుంది. కనుక చర్మ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. తింటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వారు వెల్లుల్లిని తినడం మానేయాలి.
2. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల నాడులు ప్రభావితం అవుతాయి. ఇవి తలనొప్పులను కలగజేసే అవకాశాలు ఉంటాయి. కనుక ఇప్పటికే తలనొప్పి సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తినకపోవడమే మంచిది. లేదంటే తలనొప్పి మరింత ఎక్కువవుతుంది.
3. జననావయవాలలో ఇన్ఫెక్షన్లు ఉన్నవారు వెల్లుల్లిని తింటే సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక వారు వెల్లుల్లిని తినడం మానేయాలి.
4. అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. తింటే ఆయా సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కనుక వారు వెల్లుల్లిని పచ్చిగా తీసుకోరాదు.
ఇక పైన తెలిపిన అనారోగ్య సమస్యలు కాకుండా ఇతరులు ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఉదయాన్నే పరగడుపునే వెల్లుల్లిని పచ్చిగా తినవచ్చు. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.
ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగి పోతుంది. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ కనుక వైరస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.