Liver Detox Drink : మనం శరీరంలో ఉండే అతి ముక్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయంలో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోయి కాలేయ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో కాలేయ సంబంధిత సమస్యలతో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు.
ఇలా కాలేయ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూకాలేయంలో మలినాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. కాలేయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం కాలేయంలో పేరుకుపోయిన మలినాలన్నింటిని తొలగించుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు ఆరోగ్యంగా పని చేస్తుంది. చాలా సులభంగా ఈ లివర్ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం సొరకాయ, కొత్తిమీర, పసుపు, నిమ్మకాయ, నల్ల ఉప్పు, తిప్పతీగ రసాన్ని( గిలోయ్ రసాన్ని) ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో సొరకాయ ముక్కలు, కొత్తిమీర, ముప్పావు గ్లాస్ నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ నల్ల ఉప్పు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, 30 ఎమ్ ఎల్ తిప్ప తీగ రసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లో మన కాలేయం ఎంతో శుభ్రపడుతుంది. కాలేయంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. ఈ పానీయం తయారీలో ఉపయోగించిన తిప్పతీగ మనకు ఆయుర్వేద దుకాణాల్లో, మందుల షాపుల్లో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది.
ఈ పానీయం తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మన కాలేయాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే ఇవి అన్నీ కూడా సహజ సిద్దమైనవే. కనుక ఈ పానీయాన్ని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈచిట్కాను పాటిస్తూనే చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ విధంగా పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం మన కాలేయాన్ని శుభ్రంగా, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో మనం కాలేయ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము.