Herbal Tea : మనలో చాలా మంది టీ ని తాగే అలవాటు ఉంది. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. రోజుకు 4 నుండి 6 సార్లు తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి ఎటువంటి మేలు కలగదు. పైగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. సాధారణ టీ కి బదులుగా మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ హెర్బల్ టీ ని తయారు చేయడం చాలా సులభం. దీనిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ హెర్బల్ టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ మనం దాల్చిన చెక్కను, యాలకులను, తులసి ఆకులను, పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను, 10 తులసి ఆకులను, 15 పుదీనా ఆకులను వేసుకోవాలి. తరువాత 2 లేదా 3 యాలకులను దంచి వేసుకోవాలి. ఈ నీటిని ఒక కప్పు అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. రుచి కొరకు ఇందులో తేనె, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న హెర్బల్ టీ ని టీ తాగినట్టు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగాలి. ఈ విధంగా హెర్బల్ టీని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. దగ్గు, జలుబు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. గొంతు సమస్య తగ్గుతుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. ఈ విధంగా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. సాధారణ టీ తాగే వారు దానికి బదులుగా ఇలా హెర్బల్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.