Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Nune Vankaya : నూనె వంకాయ కూర‌.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

D by D
April 7, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Nune Vankaya : మ‌నం గుత్తి వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గుత్తి వంకాయ‌ల‌తో చేసే ఏ కూర‌నైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది గుత్తి వంకాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో నూనె వంకాయ కూడా ఒక‌టి. నూనె వంకాయ చాలా రుచిగా, చిక్క‌గా, పుల్ల‌గా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రాయ‌ల‌సీమ స్టైల్ నూనె వంకాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నూనె వంకాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 12, త‌రిగిన ఉల్లిపాయ – 1, గుత్తి వంకాయ‌లు – 10, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, చింత‌పండు ర‌సం – 250 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – ఒక చిన్న క‌ట్ట‌.

Nune Vankaya recipe in telugu make in this way
Nune Vankaya

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు.

నూనె వంకాయ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, కొద్దిగా నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, మిరియాలు వేసి వేయించాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

త‌రువాత వంకాయ‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత‌ను ఉంచి వంకాయ‌ల‌ను మ‌గ్గించాలి. వంకాయ‌లు మ‌గ్గిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం వేసి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నూనె వంకాయ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ గుత్తి వంకాయ‌ల‌తో చేసే కూర‌ల కంటే ఈ విధంగా చేసిన నూనె వంకాయ చాలా రుచిగా ఉంటుంది. దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Nune Vankaya
Previous Post

Herbal Tea : గొంతులో ఇన్‌ఫెక్ష‌న్, క‌ఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బ‌ల్ టీ.. ఇలా చేయాలి..!

Next Post

Lemon For Cracked Heels : నిమ్మ‌తొక్క‌ల‌తో ఇలా చేస్తే చాలు.. పాదాల ప‌గుళ్లు పోయి అందంగా మారుతాయి..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.