Mint Leaves Drink For Lungs : మారిన వాతావరణం కారణంగా మనలో చాలా మంది దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మనకు సులభంగా లభఙంచే పదార్థాలతో పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి శ్వాస కోశ సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు ఊపిరితిత్తులు కూడా శుభ్రపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం అంతా తొలగిపోతుంది. ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఈ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. ఎంతద మోతాదులో తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేసే ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం పుదీనా ఆకులను, అల్లాన్ని, పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 10 నుండి 15 పుదీనా ఆకులు, ఒక అంగుళం అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఈ నీటిని 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి గ్లాస్ లో పోసిన తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి కలిపి తాగాలి. ఇలా ఇంట్లోనే పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. మనం వాడిన పదార్థాలల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఇన్పెక్షన్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇలా నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఊపిరితిత్తులు కూడా శుభ్రపడతాయి. అలాగే ఈ పానీయాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు అర గ్లాస్ మోతాదులో, పెద్దలు ఒక గ్లాస్ మోతాదులో ఈ పానీయాన్ని తీసుకోవ్చు. ఈ విధంగా ఇంట్లోనే ఈ పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.