Moong Dal For Cholesterol : మన శరీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవసరం. శరీరంలో కొన్ని రకాల జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ లో కూడా మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు పెసరపప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. పెసరపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా పెసరపప్పును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని వారు చెబుతున్నారు.
పెసరపప్పును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే పెసరపపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పెసరపప్పును తీసుకోవడం వల్ల కండరాలు ధృడంగా తయారవుతాయి. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ పప్పు ఎవరికైనా చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఈ విధంగా పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.