Mustard Seeds Water : రోజూ ఉదయం పరగడుపున మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల వాత రోగాలు, కొలెస్ట్రాల్, నరాల బలహీనత, అధిక బరువు, మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. ఈ టీ ని తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నీరసం, అలసట, ముఖం అంవిహీనంగా మారడం, అజీర్తి, గ్యాస్, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నింటిని దూరం చేయడంలో ఈ టీ అద్భుతంగా పని చేస్తుంది. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మనం టీ ని తయారు చేసుకోవచ్చు. దీని కోసం మనం సోంపును, ఆవాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ పదార్థాలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తాగాలి.. అలాగే ఈ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల సోంపు గింజలను వేసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత తరువాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలను వేసి మరలా 5 నిమిషాల పాటు మరిగించాలి. ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించిన తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. వడకట్టిన ఆవాలను, సోంపు గింజలను పడేయకుండా అలాగే ఉంచాలి. వీటితో మరలా టీ ని తయారు చేసుకుని తాగవచ్చు. ఇలా తయారు చేసుకున్న టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. అలాగే సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ టీని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది.
మూత్రపిండాల సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ టీని స్త్రీలు తాగడం వల్ల వారిలో హార్మోన్ల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా ఉంటుంది. దీంతో మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఈ టీని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, మొటిమల సమస్యల తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా ఈ టీని తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.