Drinking Alcohol : ఈ రోజుల్లో మందు తాగని వారి సంఖ్య చాలా తక్కువ. పదో తరగతి రాకముందే మందు అలవాటు చేసుకుంటున్నారు. అయితే మందు తాగే సమయంలో కొన్ని కాలిక్యులేషన్స్, కొన్ని రూల్స్ చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. చాలా మంది మద్యం తాగే ముందు గ్లాస్ లో వేలు ముంచి 2-3 చుక్కలు గాల్లో చిమ్ముతారు. లేదంటే 3-4 డ్రాప్స్ నేలపై పోస్తారు. ఇదేంటని ఎవరైనా అడిగితే మందు బాబులు ఇదో ఆచారం అంటారు కొందరు. మరికొందరైతే ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని నాలుగు చుక్కలు నేలపై పోస్తామంటారు. ఇక మద్యం తాగితే నిజాలు మాట్లాడతారని చెబుతున్నారు. రోమన్ శాస్త్రవేత్త చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ ప్రకారం, వైన్‌లో నిజం దాగి ఉందంట. ప్రజలు తాగినప్పుడు నిజం బయటకు వచ్చేస్తుందట.
మద్యం మన మెదడులోని నిషేధాలను తొలగించడంతో పాటు కొంత ధైర్యాన్ని కూడా అందిస్తుంది. మద్యం తాగుతున్నప్పుడు, మనం కూడా అదే చేయడానికి ఒత్తిడికి గురవుతాము. దీంతో మనం సాధారణంగా చేయని విషయాలు చేయడానికి ప్రేరేపించబడవచ్చు.అదే సమయంలో మనం ఒక్కోసారి నిజాలు కూడా మాట్లాడేస్తాము. ఒకరిపై మద్యం ప్రభావం ఎలా ఉంటుందో అనేది వారి శరీర నిర్మాణం, మద్యం తాగిన పరిమాణం, మరియు వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. వాటిని లెక్క వేసుకొని కొందరు పలు విషయాలు తెలియజేస్తూ ఉంటారు.
ఇక మద్యం తాగిన వారు గట్టి గట్టిగా మాట్లాడగలరు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మీరు ఎవరితోనైనా కోపంగా ఉన్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తి ముందు మీరు దానిని బయటకు తీస్తారు . అలాంటి సమయంలో లేనిపోని సమస్యలు, ఇబ్బందులు వస్తుంటాయి. ఇక మద్యం తాగడం వల్ల కాలేయం వ్యాధి, గుండె జబ్బులు, మరియు క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మద్యం తాగడం ఒక వ్యసనం కాగా, దానిని ఎంత తొందరగా మానేస్తే మనం మన జీవితాంతం అంత సంతోషంగా ఉంటాము.