ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనేక సమస్యలు మన దరికి చేరుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు సమస్య పెరుగుతోందని, ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హై బీపీ, లో బీపీ రెండు ప్రమాదకరమైనవి కాగా, ఇది అనేక ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది. అధిక రక్తపోటు మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారితే, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రంగా ఉండవచ్చు మరియు కొన్ని సార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
అధిక రక్తపోటు కారణంగా ఆర్టీరియల్ డ్యామేజ్ జరుగుతుంది, అది బ్లడ్ వేసెల్స్ కి గట్టిపడేలా చేస్తుంది. దీనివల్ల పాదాలకి, కాల్వలకు, మరియు శరీరంలోని ఇతర భాగాలకు రక్తం సరఫరా తగ్గిపోతుంది. దీని ఫలితంగా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మగవారిలో కంటే మహిళల్లో లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే అది లోబీపీకి దారి తియ్యవచ్చు. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా లోబీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే లోబీపీ ఉందంటే… శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లోబీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది.
హైపోటెన్షన్ ప్రమాదాన్ని తగ్గించడం లేదా నిరోధించడం సాధారణంగా సాధ్యం కాదు. మద్యపానం, ధూమపానం మొదలైన మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.సోడియం తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఎక్కువసేపు ఆకలితో ఉండడం వల్ల కూడా తక్కువ రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.ప్రతి ఒక్కరూ తమ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది తరచుగా పెరుగుతూ లేదా తగ్గుతూ ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. రక్తపోటు చాలా తక్కువగా ఉంటే, ఉప్పునీరు తీసుకోవడం ద్వారా దానిని నియంత్రించవచ్చు. అయినప్పటికీ, మీరు దాని నుండి ఉపశమనం పొందకపోతే, వెంటనే సమీపంలోని వైద్యుడి వద్దకు వెళ్లండి.