Soaked Coriander Seeds Water : మనం ఎంతో పురాతన కాలం నుంచే ధనియాలను ఉపయోగిస్తున్నాం. ధనియాలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. వీటిని కొందరు పొడిగా చేసి వంటల్లో వేస్తారు. కొందరు నేరుగానే ధనియాలను వంటల్లో వేస్తారు. అయితే ఆయుర్వేద ప్రకారం ధనియాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల మనం ధనియాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజాలను పొందవచ్చు. అయితే ధనియాలను నేరుగా తినలేము. కానీ వీటిని నీటిలో నానబెట్టి అనంతరం ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా తీసుకున్నా కూడా ధనియాలతో మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ధనియాల నీళ్లను రోజూ తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాలలో సహజసిద్ధమైన ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడకల్స్‌తో పోరాటం చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది వ్యాధులు రాకుండా చూస్తుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. ధనియాలలో విటమిన్లు కె, సి, ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శిరోజాలను దృఢంగా మారుస్తాయి. అందవల్ల ధనియాల నీళ్లను తాగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరుగుతుంది. ధనియాలను పొడిలా చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్నిహెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.
జీర్ణశక్తి పెరుగుతుంది..
జీర్ణక్రియను మెరుగు పరచడంలోనూ ధనియాల నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. ధనియాల నీళ్లను ఉదయం పరగడుపున తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. ధనియాలను నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను తాగుతుండడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే అంశం. ధనియాల నీళ్లు కిడ్నీలను బలోపేతం చేస్తాయి. కిడ్నీలు మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతోపాటు మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. అలాగే డీహైడ్రేషన్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
ధనియాల నీళ్లను తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతోపాటు గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది. ధనియాలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఇది ఫంగస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అందుల్ల ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ధనియాల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగుతుంటే మొటిమలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి మెరుస్తుంది.
ధనియాల నీళ్ల తయారీ ఇలా..
ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలనువేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ ధనియాలను తీసి ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ పరగడుపునే చేయాలి. అయితే పక్కన పెట్టిన ధనియాలను మనం వంటల్లోనూ వాడుకోవచ్చు. వాటిని పడేయాల్సిన పనిలేదు. ఇలా ధనియాల నీళ్లను రోజూ తాగడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.