మీ శరీర ఆరోగ్యం ఏ స్ధాయిలో వుందనేది మీ బాహ్య సౌందర్యం వెల్లడిస్తూంటుంది. కాంతులీనే చర్మం, అలసట ఎరుగని ముఖం, కొరవడని ఉత్సాహం అన్నీ ఒకే చోట కలసి వుంటే….ఈ రకంగా వుండాలనే అందరూ భావిస్తారు. అయితే వీటన్నిటికీ ఒకే ఒక దివ్యమైన ఔషధం….వేపాకు. మన ఆయుర్వేద వైద్యం వేపాకులోని ఔషధ గుణాలను ఏనాడో గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సమాచారాన్ని పంచింది. ఇన్ని మంచి లాభాలున్న వేపాకును మన శరీరానికి ప్రయోజనం కలిగేలా ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి.
వేపాకు రసం తాగితే ముఖంపై వుండే మొటిమలు మాయమవుతాయి. ముఖం కాంతులీనుతూ వుంటుంది. వేప రసం శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. జుత్తు నల్లగా, ఒత్తుగా నిగనిగలాడేలా, చర్మం కాంతులీనేలా, జీర్ణప్రక్రియ సవ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. అలసిన కంటికి కొద్ది చుక్కలు వేపరసం వేస్తే చూపు మెరుగవటమే కాక కామెర్లవంటివి రావు.
వేపరసం చర్మానికి మర్దన చేస్తే మశూచి మచ్చలు మాయం అవుతాయి. వేపరసంలో కొద్దిపాటి ఉప్పు లేదా పెప్పర్ వేసుకు తాగండి. రసం తీసిన వెంటనే కొంచెం ఐస్ కలిపి తాగేయండి. 30 నిమిషాలకంటే ఎక్కువగా నిలువ వుంచవద్దు. తాగేసిన తర్వాత దాని రుచి ప్రభావం నాలుకపై వుండదు. వేప రసం తాగేటపుడు ముక్కు మూసుకోండి. త్వరగా వాసన తెలియకుండా లోపలికి పోతుంది. షుగర్ కలిపి తీసుకోవద్దు. లాభం వుండదు. ఉదయమే పరగడుపుతో తాగితే మంచి లాభం పొందవచ్చు.