తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం సమస్య ఏర్పడినా, మలబద్దకం సమస్య వచ్చినా ఇబ్బందులు కలుగుతాయి. వీటిని పట్టించుకోకపోతే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ రెండు సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. అయితే సార పప్పు అందుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్నే చిరోంజి అంటారు. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించడంలో ఈ పప్పు బాగా పనిచేస్తుంది.
ఈ పప్పు చూసేందుకు డ్రై ఫ్రూట్ లా ఉంటుంది. మనకు మార్కెట్‌లో లభిస్తుంది. ఈ పప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. చిన్నపేగుల లోపలి గోడలను ఈ పప్పు సురక్షితంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది.
కేవలం మలబద్దకం మాత్రమే కాదు, విరేచనాలకు కూడా సార పప్పు బాగానే పనిచేస్తుంది. దీన్ని కిచ్‌డీ, పోహా లేదా ఇతర ఆహారాల్లో వేసి తీసుకోవచ్చు. ఈ పప్పును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు.
సార పప్పులో విటమిన్లు బి1, బి2, సి ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నాడులను దృఢంగా మారుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.
అందువల్ల ఈ పప్పును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.