Liver Health : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలామంది లివర్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. లివర్ కనుక ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటిని తీసుకుంటే, లివర్ చాలా బాగుంటుంది. లివర్ సమస్యలకి దూరంగా ఉండొచ్చు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లివర్ ఆరోగ్యానికి కూడా, పసుపు బాగా ఉపయోగపడుతుంది.
పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమెటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా, పసుపులో ఉంటాయి. పసుపు శరీరంలోని మంటను తగ్గిస్తుంది. లివర్ కి హాని కలగకుండా చూస్తుంది. లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే, గ్రీన్ టీ తీసుకుంటే కూడా, లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్ ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజు గ్రీన్ టీ తీసుకుంటే, లివర్ సమస్యలు ఉండవు. లివర్ ఆరోగ్యానికి కమల పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయి.
ద్రాక్ష, నిమ్మ, కమల, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన, లివర్ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలానే, లివర్ ఆరోగ్యంగా ఉండడానికి క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటివి తీసుకోవడం మంచిది. ఈ కూరగాయలు లివర్ని ఆరోగ్యంగా ఉంచగలవు.
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. సాల్మన్, అవిసె గింజలు, అవకాడో తీసుకోవడం మంచిది. వాల్నట్స్ బీట్రూట్ తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన లివర్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.