Tomato Soup Recipe : టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది టమాటాలని రకరకాల వంటకాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. టమాటా సూప్ తాగితే కూడా, చాలా బాగుంటుంది. అందులోనూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా సూప్ ని తీసుకుంటూ ఉంటే, ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాట సూప్ తాగడం వలన ఫైబర్, పొటాషియంతో పాటుగా పలు విటమిన్స్, కాపర్, సెలీనియం కూడా అందుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమాటాని, ఆహారంలో చేర్చుకుని ఉప్పును తగ్గిస్తే, గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మధుమేహంతో బాధపడే వాళ్ళు, రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే, టమాటా సూప్ ని చేయడం కష్టమేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఈజీగా మనం టమాటా సూప్ ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. మరి టమాటా సూప్ ని ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం.
టమాట సూప్ ని తయారు చేయడానికి ముందు, మంచి టమాటాలని తీసుకోండి. ఆర్గానిక్ టమాటాలని కానీ విదేశీ నుండి ఎగుమతి చేసుకునే వాటిని అయినా సరే తీసుకోవచ్చు. లోకల్ టమాటలతో కూడా చేసుకోవచ్చు. అయితే, టమాటాలని నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో నానబెట్టుకోండి. ఇప్పుడు టమాటా తొక్కల్ని తీసేసి, పక్కన పెట్టుకోండి. ఇది ఒక టేస్ట్. టమాటాలని రోస్ట్ చేసుకుంటే ఇంకొక టేస్ట్.
ఇప్పుడు మీరు ఒక పాన్ తీసుకుని. అందులో కొంచెం బట్టర్ వేసి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసి, కొంచెం నీళ్లు పోసుకోండి. ఇందులో చికెన్ కానీ కూరగాయల్ని కానీ వేసుకుని, 40 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. అంతే. కాసేపట్లో మంచి టమాటా సూప్ రెడీ అయిపోతుంది. బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి, సర్వ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సూప్ తీసుకుంటే, టేస్టీగా అనిపించదు. కాస్త వేడిగా ఉన్నప్పుడే సూప్ ని తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది.