చాలామంది 40 సంవత్సరాల వయసు దాటినవారు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ, ఆహార ప్రణాళికలు ఆచరిస్తూ తాము బరువు పెరిగామని పొట్ట వచ్చిందని చెపుతూంటారు. 40 సంవత్సరాల వయసులో బరువు పెరగకుండా వుండాలంటే సరైన వ్యాయామం చేయటం, సంతులిత ఆహారాన్ని తీసుకోవడం చేయాలి. అసలు మధ్య వయసు వారిలో ఈపొట్ట పెరగటానికి గల కారణాలు పరిశీలిస్తే… 40 ఏళ్ళ పై వయసు గలవారు కండరాల బలాన్ని కోల్పోతారు. పొట్టకు కొవ్వు పెరగటానికి కారణాలలో ఇది ప్రధానమైంది. పోయిన ఈ కండ కొవ్వు పొరగా ఏర్పడుతుంది.
నిద్ర సరిగా లేకపోవటం కూడా మధ్య వయసు వారిలో అధిక బరువు కలిగిస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ పెరగటం పురుషులకు కారణమయితే, స్త్రీలకు మెనోపాజ్ కారణంగా అధిక బరువు ఏర్పడుతుంది. 40 సంవత్సరాల పై వయసు వారు ఆహారాన్ని తక్కువగా తీసుకున్నప్పటికి లావెక్కుతున్నారనేదానికి ఇవే కారణాలు. పొట్ట, కొవ్వు నిల్వలను తగ్గించే మార్గాలు – బ్రక్కోలి, కాలీఫ్లవర్, గోంగూర, బీట్ రూట్, సిట్రస్ పండ్లు తినటం శరీరంలో ఈస్త్రోజన్ ఉత్పత్తిని తగ్గించి పొట్ట తగ్గేందుకు సహకరిస్తుంది.
గ్రేప్ సీడ్ లేదా ఆలివ్ ఆయిల్ కూరలు ఇతర పదార్ధాలలో వాడండి. అదే రకంగా, ముడి నువ్వులు లేదా అవిసె గింజలు సలాడ్లలో వాడితే అది శరీరంలోని ఈస్ట్రోజన్ స్ధాయిలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ప్రొటీన్ అధికంగా వుండే ఒక ఆహారాన్ని తీసుకోండి. గుడ్లు, నాటు మాంసం, చేప, కాయధాన్యాలు, మొదలైనవి మంచి పోషకాలనిస్తాయి. కేలరీలు నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పొట్ట కొవ్వు తగ్గించవచ్చు. రోజూ 30 నిమిషాలు కనీసం నడవటం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం, సైకిలింగ్ లేదా మీకు సరి అనుకున్న ఇతర వ్యాయామాలు చేసినా ఫలితం వుంటుంది.
ఆల్కహాలు వినియోగం బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే పొట్ట కొవ్వు అదుపులో వుంటుంది. అధికమైన ఒత్తిడి కలిగి వుండటం కూడా శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. మంచి జీవన విధానంఆచరించి ఒత్తిడి తగ్గించుకోండి. పై చర్యలు పాటించే వారికి పొట్టకొవ్వు వదిలించుకోవడం, అధిక కొవ్వు శరీరంలో లేకుండా చేసుకోవడం పెద్ద సమస్యేమీ కాదని గ్రహించండి.