అధిక బరువు తగ్గేందుకు కొందరు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటుంటారు. కానీ బరువు తగ్గే క్రమంలో కొందరు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తారు. నిజానికి అలా చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల రోజులో మిగిలిన సమయాల్లో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను తింటారని, దీంతో అధికంగా బరువు పెరిగేందుకు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరి బరువు తగ్గడం ఎలా ? అంటే..
రోజూ ఉదయాన్నే అల్పాహారంలో కొవ్వులు, కార్బొహైడ్రేట్లు కాకుండా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో బరువు తగ్గవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రోటీన్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే కొవ్వులు, పిండి పదార్థాల కన్నా ప్రోటీన్లను జీర్ణం చేసేందుకే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. కనుక ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఉదయాన్నే తినడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాల విషయానికి వస్తే గుడ్లు ముందు వరుసలో నిలుస్తాయి. అలాగే చికెన్, మటన్, చేపలు, పప్పు దినుసులు వంటివన్నీ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలే. వీటిని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. అలాగే శనగలు, బీన్స్‌లోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే అల్పాహారంలో తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.
వీటితోపాటు పీనట్ బటర్, బాదం పప్పు, యాపిల్స్ అవకాడో, అరటి పండ్లు, ద్రాక్షలు, బెర్రీలు, చిలగడ దుంపలు, బ్రొకొలి, పాలకూర, మిరియాలు, వాల్‌నట్స్, అల్లం, దాల్చిన చెక్క, అవిసె గింజలు, కొబ్బరినూనె వంటి పదార్థాలను కూడా ఉదయాన్నే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇవన్నీ ప్రోటీన్లను, ఇతర పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి. కనుక మనకు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365