ఈ సీజ‌న్‌లో వేడిని త‌రిమికొట్టండి.. ఈ ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది..!

వేస‌వి వ‌చ్చిందంటే చాలు చాలా వేడిగా ఉంటుంది. శ‌రీరం వేడిగా మారుతుంది. దీంతో అంద‌రూ శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు య‌త్నిస్తుంటారు. అందుకుగాను నీటిని తాగ‌డం, చ‌ల్ల‌ని ప‌దార్థాలను తిన‌డం చేస్తుంటారు. అయితే కాలానుగుణ‌మైన పండ్లు, కూర‌గాయ‌లతోపాటు ఇత‌ర ప‌దార్థాల‌ను తిన‌డం ద్వారా కూడా వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వేడి త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే…

take these summer foods to be cool

1. వేస‌విలో పుచ్చ‌కాయ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇది చాలా రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, తాజాద‌నాన్ని అందిస్తుంది. ఇందులో 92 శాతం వ‌ర‌కు నీరు ఉంటుంది. అందువ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. పుచ్చ‌కాయ‌లో లైకోపీన్‌, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. వీటిని ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల క్యాల‌రీలు కూడా త‌క్కువ‌గా ల‌భిస్తాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ఈ సీజ‌న్‌లో వీటిని త‌ర‌చూ తీసుకోవ‌చ్చు.

2. వేస‌వి సీజ‌న్‌లో క‌చ్చితంగా తినాల్సిన ప‌దార్థాల్లో ఒక‌టి కీర‌దోస. పుచ్చ‌కాయ‌లాగే ఇందులోనూ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. క‌నుక కీర‌దోస‌ను తింటే శ‌రీరం కోల్పోయిన ద్ర‌వాలు తిరిగి ల‌భిస్తాయి. వేస‌విలో ఎక్కువ‌గా ద్ర‌వాలు పోతుంటాయి క‌నుక కీర‌దోస‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ద్ర‌వాలు తిరిగి వ‌స్తాయి. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. ఇక కీర‌దోస‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది.

3. వేస‌విలో ప్ర‌తి ఒక్క‌రూ పెరుగును త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఎందుకంటే పెరుగు శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్ని ఇస్తుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వేస‌విలో జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

4. వేస‌విలో తీసుకోవాల్సిన కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఒక‌టి. ఇందులో విట‌మిన్ సి, ఖ‌నిజాలు, ఇత‌ర సూక్ష్మ పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే కాలిఫ్ల‌వ‌ర్‌లో నీరు అధికంగా ఉంటుంది క‌నుక వేస‌విలో దీన్ని తీసుకుంటే శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి.

5. వేస‌విలో త‌ర్బూజా పండ్ల‌ను కూడా క‌చ్చితంగా తీసుకోవాలి. వీటిల్లోనూ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది శ‌రీరం కోల్పోయే ద్ర‌వాల‌ను భ‌ర్తీ చేస్తుంది. అయితే ఈ పండ్లు రుచి లేకుండా ఉంటాయి. క‌నుక జ్యూస్‌లా త‌యారు చేసి అందులో చ‌క్కెర‌కు బ‌దులుగా తేనె లేదా బెల్లం క‌లుపుకుని తాగితే మంచిది. దీని వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts