శరీరానికి నిమ్మరసం చేసే మేలు పురాతన కాలంలో నే గుర్తించారు. నేటి సెలబ్రిటీలందరూ నిమ్మరసానికి ఎంతో ప్రాధానన్యతనిచ్చి తమ శారీరక సౌష్టవాలను, అంద చందాలను కాపాడుకుంటున్నారు. మరి ఇంతగా ప్రాధాన్యతకల నిమ్మరసం చేసేదేమిటి? ఇది శరీర బరువును తగ్గించటమే కాదు, శరీరంలో హాని కలిగించే వ్యర్ధాలను తొలగిస్తుంది. మరి నిమ్మరసం ఆహారంగా ఎలా వాడాలో చూడండి. నిమ్మరసం ఆహారంగా వాడేటపుడు, ఘన ఆహారాలు తీసుకోకండి. పండ్లు, కూరగాయలు లేదా అన్నం వంటివి ఏమీ తినవద్దు.
మసాలాలు కూడా తినకండి. ప్రతిరోజు 8 గ్లాసుల చొప్పున ఒక వారం రోజులపాటు నిమ్మరసం తాగుతూ వుండండి. ఎంత నీరు తాగాలనుకుంటే అంత తాగుతూండండి. కానీ ఘన ఆహారాలు ఎట్టిపరిస్ధితిలో తినవద్దు. నిమ్మ రసం ఆహారంగా వాడేటపుడు లెమనేడ్ ఎలా తయారు చేయాలి? ఇది చాలా తేలిక. నిమ్మకాయ అర చెక్కను ఒక అర గ్లాసు నీటిలో కలిపి రెండు టేబుల్ స్పూన్ల తేనె, కొద్దిపాటి మిరియంపొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 4 గ్లాసుల చల్లటి నీటిలో కలిపి పలుచన చేయండి. ప్రతి గంటకు ఒక గ్లాసు చొప్పున రోజంతా తాగుతూండండి. ఈ రకంగా ఒక వారం రోజులపాటు తాగండి.
అయితే మీరు తాగే నీరు చల్లనిదిగా వుండేలా చూడండి. నిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి మీ శరీరంలోని మాలిన్యాలను తొలగిస్తాయి. మీరు తాగే తేనె మీకు రోజువారీ చర్యలకవసరమైన శక్తినిస్తుంది. ఈ రకంగా ఒక వారంపాటు మీరు నిమ్మరసం ఆహారంపై వుంటే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు పోయి మీ జీర్ణ వ్యవస్ధ శుభ్రపడుతుంది. శరీరం కాంతివంతంగాను, చురుకుగాను వుంటుంది.