చాలా దేశాలలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏటా గుండె జబ్బు కాన్సర్ వంటి వ్యాధి కంటే కూడా అధికంగా అమెరికన్ల ప్రాణాలు బలితీసుకుంటోంది. ఇటీవల, గుండె జబ్బు మహిళలలో ఎక్కువగా పెరుగుతోంది. రొమ్ము కేన్సర్ కంటే కూడా ఎక్కువగా మహిళల మరణాలకు కారణమవుతోంది. పరిశోధనల ఆధారంగా నాడీ సంబంధిత సమస్యలవలన చిన్నతనం నుండే ఈ వ్యాధులు వస్తున్నట్లు తేలింది. కనుక ప్రతివారూ తమ చిన్న వయసునుండే గుండె జబ్బుల పట్ల సరైన అవగాహన కలిగి తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.
గుండె రక్తనాళాల వ్యాధి లేదా కార్డియో వాస్క్యులర్ వ్యాధి అనేది గుండె లేదా రక్త నాళముల (ధమనులు మరియు సిరలు) వంటి వాటికి చెందిన జబ్బు. కానీ ఇది సాధారణముగా ఆథేరోస్క్లేరోసిస్ (ధమనుల జబ్బు) ను సూచించడానికి వాడబడుతుంది. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే అందుకు తగిన రోగికిగల చిన్న తనపు ఆహార, శారీరక శ్రమ మొదలైన పరిస్థితులు పరిశీలించాలి. అపుడు వ్యాధి నివారణ తేలిక అవుతుంది. కార్డియాలజిస్ట్లు, పొట్ట భాగం శస్త్రచికిత్స నిపుణులు , నాడీ సంబంధమైన శస్త్రచికిత్స నిపుణులు , నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణులు, మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లు, చికిత్స చేయవలసిన శరీర భాగం ఆధారంగా ఈ కార్డియో వాస్క్యులార్ వ్యాధికి చికిత్స చేస్తారు.
ఇలాంటి ప్రత్యేక చికిత్సలలో కొన్ని కొన్ని మిళితం అయిపోతాయి మరియు ఒకే వైద్యశాలలో వివిధ రకాల నిపుణులచే నిర్దిష్ట చికిత్సలు చేయబడడం అనేది చాలా సాధారణ విషయం. గుండె జబ్బులు నిర్ధారించబడే వరకు, వాటికి అసలు కారణమైన ఆథేరోస్క్లేరోసిస్ చాలా ఎక్కువగా పెరిగి పోయి ఉంటుంది, అప్పటికే కొన్ని ఏళ్ళ వయసు గడిచి పోయి వుంటుంది. అందుకే చక్కటి ఆహార అలవాట్లు, వ్యాయామము చేయడం మరియు పొగ తాగడం వంటివి మానివేయడం వంటి వాటి ద్వారా ఆథేరోస్క్లేరోసిస్ రాకుండా చూసుకోవటం పై మరింత శ్రద్ధ పెట్టాలి..