బరువు తగ్గాలంటే డైట్ సోడా మంచి పానీయమంటారు. డైటింగ్ ప్రియులు ప్రతి భోజనం తర్వాత ఒక గ్లాస్ డైట్ సోడా తాగేస్తారు. మరి ఇది సరైనదేనా? బరువు తగ్గిస్తుందా? పరిశీలించండి. ఇటీవల అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక సమావేశంలో డైట్ సోడా వాస్తవంగా శరీర కొవ్వును ఖర్చు చేయదని బరువు పెంచుతుందని తెలిపింది.
దీర్ఘకాలంలో కార్బోనేటెడ్ పానీయాలు ప్రత్యేకించి డైట్ సోడా వంటివి అనారోగ్య కేలరీలు ఇస్తాయని తెలిపింది. డైట్ సోడాలో కలిపే స్వీటెనర్ కృత్రిమమైంది అది శరీరంలో రక్తంలోని షుగర్ స్ధాయిలను పెంచి డయాబెటీస్ కలిగిస్తుందని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్ కల డ్రింక్ ఏదైనప్పటికి అనారోగ్యమే. అది బరువు పెంచుతుంది. డైట్ సోడాలో శాక్రిన్ సుర్కాలోస్, నియోటేమ్ అనే షుగర్లు బరువును పెంచుతాయి.
డైట్ సోడా డీహైడ్రేషన్ కలిగిస్తుంది. నీటికి సరైన ప్రత్యామ్నాయం కాదు. డైట్ సోడా అనారోగ్యం. అది గుండె సంబంధిత వ్యాధులు కూడా పెంచే అవకాశం వుంది. కనుక డైట్ సోడా అనారోగ్యమని దానివలన బరువు పెరుగుతుందేకాని తగ్గదని గ్రహించండి.