Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Travel Health Tips In Summer : వేస‌విలో ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌తో ఆరోగ్యంగా ఉండండి..!

D by D
April 15, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Travel Health Tips In Summer : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేవి వేసవి సెల‌వులు. ఈ సెల‌వుల స‌మ‌యంలో చాలా మంది విహార యాత్రల‌కు వెళ్తూ ఉంటారు. ఎక్కువ‌గా దూర ప్ర‌యాణాలు, స‌ముద్రాల ద‌గ్గ‌రికి వెళ్తూ ఉంటారు. చాలా మంది వేస‌వి సెల‌వుల్లో ప్ర‌యాణాలు చేస్తూ చ‌క్క‌గా వేస‌విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా సెల‌వుల‌ను గ‌డుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అలాగే ప్ర‌యాణం చేసి ఇంటికి వ‌చ్చిన త‌రువాత కొంద‌రు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. డీహైడ్రేష‌న్, వాంతులు, నీళ్ల విరోచ‌నాలు, వికారం, నీర‌సం ఇలా వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌నుక వేసవిలో దూర ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మ‌న ఆరోగ్యం గురించి కూడా శ్ర‌ద్ద వ‌హించాలి. ఈ స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. వేస‌వికాలంలో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవికాలంలో ఎండ కార‌ణంగా మ‌న‌కు విప‌రీతంగా చెమ‌ట ప‌డుతూ ఉంటుంది. శ‌రీరంలో ఉండే నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. క‌నుక మ‌న‌ల్ని మ‌నం ఎప్పుడూ హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి. నీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి. వీలైతే కొబ్బ‌రి నీళ్లు, గ్లూకోజ్ వాట‌ర్, నిమ్మ‌కాయ నీళ్లు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్ తిరిగి శ‌రీరానికి అందుతాయి. నీర‌సం రాకుండా ఉంటుంది. అలాగే వేసవిలో బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. సూర్య‌ర‌శ్మి ఎక్కువ‌గా చ‌ర్మానికి తాక‌డం వల్ల చ‌ర్మానికి హాని క‌లుగుతుంది. క‌నుక వేస‌విలో బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో స‌న్ స్క్రీన్ లోష‌న్స్ వాడ‌డం మంచిది. అలాగే త‌ల‌పై టోపిని ధ‌రించ‌డం కూడా ముఖ్యం. అదే విధంగా వేస‌విలో ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో ఆహార విష‌యంలో కూడా జాగ్ర‌త్త వ‌హించాలి. ఎక్కువ కారం, నూనె, మ‌సాలాలు లేని ఆహారాన్ని తీసుకోవాలి. తేలిక‌గా జీర్ణ‌మ‌య్యే ఆహారాలు తీసుకోవాలి.

Travel Health Tips In Summer follow these to prevent sickness
Travel Health Tips In Summer

ముఖ్యంగా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు శాఖాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. త‌గిన ఆహారాన్ని తీసుకోక‌పోతే క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి, వాంతులు, విరోచ‌నాలు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే ప్ర‌యాణ స‌మ‌యంలో శ‌రీరానికి త‌గిన విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి. రోజంతా తిరిగినా రాత్రి చ‌క్క‌గా నిద్రపోవాలి. దీంతో నీర‌సం, బ‌ల‌హీన‌త వంటివి ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే మ‌నం తీసుకునే ఆహారం, నీటి విష‌యంలో కూడా జాగ్ర‌త్త ప‌డాలి. శుభ్ర‌మైన నీటిని తాగాలి. మ‌నం ఆహారం తీసుకునే చోట ప‌రిశుభ్రంగా ఉందా లేదా గ‌మ‌నించాలి. దాహం వేస్తుంది క‌దా అని అప‌రిశుభ్ర‌మైన నీటిని తాగితే వాంతులు, నీళ్ల విరోచ‌నాలు అయ్యే అవ‌కాశం ఉంది. ఈ విధంగా వేసవిలో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వేసవి విహార యాత్ర‌ల‌ను చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Tags: Travel Health Tips In Summer
Previous Post

Beerapottu Pachi Karam : కమ్మ‌ని బీర‌పొట్టు ప‌చ్చికారం.. ఒక్క‌సారి అయినా స‌రే ట్రై చేయండి..!

Next Post

Cabbage Sambar : క్యాబేజీ సాంబార్ త‌యారీ ఇలా.. క‌మ్మ‌ని రుచి.. టేస్ట్ చేస్తే విడిచిపెట్ట‌రు..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.