Vamu Powder For Fat : రోజూ వేడి నీళ్లల్లో ఒక టీ స్పూన్ ఈ పొడిని కలుపుకుని తాగిదే చాలు… పది రోజుల్లోనే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు. కేవలం బరువు తగ్గడమే కాదు ఈ పొడిని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం నాలుగు పదార్థాలను ఉపయోగించి మనం ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను, సోంపు గింజలను, వామును, బ్లాక్ సాల్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ పదార్థాలన్నీ మన శరీరంలో కొవ్వును కరిగించడంలో ఉపయోగపడతాయి. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల జీలకర్రను, రెండు టీ స్పూన్ల వామును తీసుకోవాలి. తరువాత వీటిని ఒక కళాయిలో వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత ఇందులో 2 టీ స్పూన్ల సోంపు గింజలను వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిలో అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ను వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ పొడిని రెండు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అయితే దీనిని వారానికి ఒకసారి తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇలా తయారు చేసుకున్న పొడిని రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. 40 నుండి 50 రోజుల పాటు ఈ పొడిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులను మనం గమనించవచ్చు. మూడు నెలల పాటు ఈ పొడిని వాడడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మం పై ఉండే ముడతలు తొలగిపోయి చర్మం యవ్వనంగా తయారవుతాయి. శరీరం బలంగా తయారవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ పొడిని క్రమం తప్పకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
ఎముకలు ధృడంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా,బలంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పొడిని వాడడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. ఈ పొడిని 10 రోజుల పాటు వాడిన తరువాత నచ్చితే మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఇలా వాడిన తరువాత 15 రోజులు వాడడం మానేసి మరలా మూడు నెలల పాటు వాడాలి. ఈ పొడిని ఇలా వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.