పని ఒత్తిడి, శారీరక శ్రమ కారణంగా అలసి సొలసిన శరీరానికి మసాజ్ చేస్తే దాంతో ఎంతో రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుందని అందరికీ తెలిసిందే. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవడమే కాదు, చక్కని నిద్ర వస్తుంది. శరీరానికి హాయిగా ఉంటుంది. అయితే ఎవరైనా మసాజ్ చేసుకోవాలంటే ఏదైనా స్పా దగ్గరికో, మసాజ్ సెంటర్ కో వెళ్లాలి. కానీ… అలా కాకుండా భార్యా భర్తలయితే వారిద్దరూ ఒకరికి ఒకరు ఎంచక్కా మసాజ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ముందు చెప్పిన విధంగా బాడీ రిలాక్స్ అవడమే కాదు, దాంతో పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. వీటితోపాటు వారిద్దరికీ ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంపతుల్లో ఎవరు ఎవరికి మసాజ్ చేసినా దాంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. చక్కని నిద్ర వస్తుంది. జీవిత భాగస్వాములిద్దరూ అలా ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం వల్ల వారిద్దరి మధ్య బంధం మరింత దృఢపడుతుంది. తమ పార్ట్‌నర్ తమ ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకుంటున్నాడని గుడ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది వారిద్దరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది.
దంపతులిద్దరూ ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం వల్ల వారి మధ్య సంబంధం బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇరువురూ ఒకరంటే ఒకరు ఇష్టపడడం ఎక్కువవుతుంది. ఒకరి కష్టంలో పాలు పంచుకున్నట్టు మరొకరికి అనిపిస్తుంది. కొన్ని జంటలు ఒకరినొకరు ముట్టుకోవాలంటేనే జంకుతారు. అలాంటి వారు ఈ విధానం ప్రయత్నిస్తే తద్వారా వారి మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ మెరుగు పడుతుంది. టచ్ అంటే ఇకపై ఏమాత్రం విసుక్కోరు. పైగా అది కావాలని ఆశిస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు మసాజ్ చేసుకుంటే దాంతో వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి కేరింగ్ పెరుగుతుంది. కొందరు ఈ విధానంలో తమ పార్ట్‌నర్‌కు ప్రేమను వ్యక్త పరుస్తారట.
జంట ఇద్దరూ మసాజ్ చేసుకుంటే వారి శరీరాల్లో ఆక్సిటోసిన్ అనబడే ఓ హార్మోన్ విడుదలవుతుందట. ఇది వారిలోని శృంగార కాంక్షను మరింత పెంచుతుందట. దీంతో రతి క్రియలో వారు చురుగ్గా పాల్గొంటారు. నిద్రించడానికి ముందు గంట పాటు… అంటే… ఒకరు 30 నిమిషాలు, మరొకరు 30 నిమిషాలు తమ పార్ట్‌నర్‌కు మసాజ్ చేస్తే దాంతో ఇక వారి దాంపత్య జీవితానికి ఏ ఢోకా ఉండదట.