Chapati : అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు డైట్ లో మార్పులు చేసుకోవాలి. అలానే ఫిజికల్ యాక్టివిటీకి కాస్త సమయాన్ని ఇవ్వాలి. అధిక బరువు సమస్య ఉన్నవాళ్లు ఎటువంటి ఆహారం తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. అధిక బరువు ఉన్నవాళ్లు హై క్యాలరీ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.
అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు ఆహారం బాగా జీర్ణమయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలి. అదే విధంగా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇతర అనారోగ్య సమస్యలు కలగకుండా చూసుకోవడం చాలా అవసరం. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే.. అధిక బరువు ఉన్న వాళ్ళు చపాతీ తినొచ్చా..?, తినకూడదా..? ఒకవేళ తినొచ్చు అంటే ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు అని.
జీవనశైలి మారడం వలన చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వలన చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం మానేసి చాలా మంది జొన్న రొట్టెలు, చపాతీలు, రాగి రొట్టెలు వంటివి తింటూ ఉంటారు.
అయితే చపాతీలు మానేసి అన్నం తినడం కరెక్టా కాదా అనే విషయానికి వస్తే.. అన్నంతో ఎన్ని లాభాలు అయితే ఉంటాయో, చపాతీలు తినడం వలన కూడా అంతే లాభం. కానీ అన్నం కంటే చపాతీలు త్వరగా జీర్ణం అవుతాయి. నూనె వేయకుండా కానీ కొంచెం నూనె వేసుకుని కానీ కాల్చుకోవడం మంచిది. పైగా రెండు మూడు చపాతీలు తీసుకుంటే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో తక్కువ తినొచ్చు. పైగా త్వరగా బరువు తగ్గొచ్చు.