ఇద్దరు వ్యక్తులు సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తితోను సన్నిహితంగా మెలిగితే మనకి చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఆ విషయం మనకు రుజువు కానప్పుడు డైరెక్ట్ గా అడగలేము. నిర్దారణకి రానప్పుడు కొన్ని సంకేతాల ద్వారా అసలు విషయాన్ని గ్రహించవచ్చు.ముందుగా ఆమె గతం కన్నా భిన్నంగా ఉంటుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ మూడీగా ప్రవర్తిస్తున్నట్లు మీకు అనిపిస్తే, ఆమె చికాకుగా ఉంటే, ఆమె మీతో ఎటువంటి కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏదో జరుగుతుందని అనుమానించాలి. మీ గర్ల్ ఫ్రెండ్ కంట్లోకి చూసి మాట్లాడలేకపోతుంటే, మీరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆమె ముఖం ఎర్రగా మారిందంటే ఏదో జరుగుతుందని అనుకోవాలి.
మీ గర్ల్ ఫ్రెండ్ ఏదో ఆలోచనల్లో కూరుకుపోయి, ఏ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉంటే మిమ్మల్ని మోస చేస్తుందని ధృవీకరించుకోవచ్చు. మీ స్నేహితురాలు ఎవరికి మెసేజ్‌లు పంపుతోంది మరియు ఎవరికి కాల్ చేస్తోంది అనే విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంటే దానిని హెచ్చరికలా భావించాలి. ఆమె తన ఫోన్‌ని ఎవరికి ఇవ్వకుండా, ఎవరిని టచ్ చేయనివ్వకపోతే కొంత అనుమానించాల్సి వస్తుంది. మీ గర్ల్‌ఫ్రెండ్ అకస్మాత్తుగా అందంగా రెడీ అవ్వడం, వస్త్రధారణలపై ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభించిందని మీకు అనిపిస్తే ఏదో జరుగుతుందని అనుమానించాలి.
మీ స్నేహితురాలు అకస్మాత్తుగా మీ ఆచూకీ గురించి మరింత అడగడం ప్రారంభిస్తే అనుమానించాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు వంటివి అడుగుతుంది అంటే తప్పక ఏదో జరుగుతుందని అర్ధం చేసుకోవాలి. ఆమె తన ప్రియుడితో దొరకకుండా ఉండేందుకు ఇవన్నీ అడుగుతుందని భావించాలి. మీ భాగస్వామి మీతో వింతగా ప్రవర్తించడం, చీటికి మాటికి గొడవలు పడడం, ఏదో ఒక విషయం తీసి చిరాకు పడడం వంటివి చేస్తే అనుమానించక తప్పదు.