Sleep : మన శరీరానికి నిద్ర కూడా ఎంతో అవసరం. రోజూ 6 నుండి 8 గంటల పాటు ఖచ్చితంగా మనం నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల మన శరీరంలో అనేక మంచి మార్పులు చోటు చేసుకుంటాయని, అలాగే మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. నిద్రపోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మనం రోజంతా పని చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మనం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి శరీరం చల్లబడుతుంది.
అలాగే మనం నిద్రించినప్పుడు మన మెదడు గ్లూకోజ్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. మెదడు కణాలకు గ్లూకోజ్ ఎక్కువగా చేరడం వల్ల మెదడు కణాల్లో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. మెదడు కణాలు చురకుగా పని చేస్తాయి. మన మెదడు చురుకుగా పని చేయాలంటే మనం తప్పకుండా నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఎదుగుదల నిద్రించే సమయంలో ఎక్కువగా ఉంటుంది. నిద్రించేటప్పుడు ఎముకల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా నిద్రపోని పిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కనుక పిల్లలు కూడా తప్పకుండా నిద్రపోయేలా చూసుకోవాలి. అదే విధంగా నిద్రించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
నిద్రించే సమయంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీంతో రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే నిద్రించడం వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. దీంతో గుండెకు కూడా విశ్రాంతి లభించి మరుసటి రోజుకు చురుకుగా పని చేస్తాయి. అదే విధంగా మనం రోజంతా పని చేయడం వల్ల మన కండరాలు అలసటకు గురి అవుతాయి. మనం నిద్రించడం వల్ల కండరాల అలసట తగ్గి కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అలాగే కండరాల్లో విడుదలైన రసాయన సమ్మేళనాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దీంతో మనం మరుసటి రోజు మరింత చురుకుగా మరింత ఎక్కువ సమయం పని చేసుకోగలుగుతాము. అలాగే మనం నిద్రించే సమయంలో మన జీర్ణవ్యవస్థ కూడా విశ్రాంతిని తీసుకుంటుంది. కాలేయంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
ఒకవేళ మనం నిద్రించకపోతే జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. క్రమంగా జీరర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. అదే విధంగా మనం తగినంత సమయం నిద్రించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎక్కువగా నిద్రించే వారు ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోకపోవడం వల్ల వయసు రాకుండానే ముసలివారు అవుతారు. అలాగే మనం నిద్రించినప్పుడు మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన మలినాలు, ఫ్రీరాడికల్స్ అన్నీ కూడా తొలగించబడతాయి. మనం సరిగ్గా నిద్రించడం వల్ల ఇలాంటి అనేక రకాల లాభాలను పొందవచ్చు. కనుక ప్రతిఒక్కరు రోజూ 6 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలని సరిగ్గా నిద్రించకపోతే ఈ లాభాలన్నింటిని మనం కోల్పోతామని అనారోగ్యానికి గురి అవుతామని నిపుణులు సూచిస్తున్నారు.