హెల్త్ టిప్స్

ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తే.. ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చాలా మంది ఏదైనా ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తుంటారు. కొంద‌రు చూడ‌కుండానే తింటారు. అస‌లు వాస‌న చూస్తే ఏం అవుతుంది..? అన్న‌ది తెలియాలంటే ఓ లుక్కేసేయండిటు..! సాధార‌ణంగా నోరూరించేలా కంటిముందు ఏదైనా కనిపిస్తే, కడుపు నిండా లాగించేయాలని అనుకుంటారు ఎవరైనా. ఇదే సమయంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుంటుంది. అయితే, కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను రెండు నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా తింటారట.

ఓ అధ్యయనం మేర‌కు ఈ విష‌యం బ‌య‌ట ప‌డింద‌ట‌. కేవ‌లం 2 నిమిషాలు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది.

what happens if you smell food before eating

ఆ తర్వాత ఆహారం ఏది అయినా, తక్కువగానే తీసుకుంటామని, క్యాలరీలు పెరుగుతాయన్న భయం ఉండదని చెప్పింది. ఆహారం వాసన వల్ల సంతృప్తి లభించడమే దీనికి కారణమని వివరించింది.

Admin