దక్షిణ భారత ప్రజల ప్రధాన ఆహారంగా బియ్యాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది మూడు పూటలు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అన్నం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. తెల్ల బియ్యంలో పోషకాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రైస్ ను తినడం వల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు బియ్యాన్ని పూర్తిగా మానేయడం వల్ల ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు చెప్పేది ఏంటంటే..మీరు ఒక నెల రోజుల పాటు రైస్ ను తినకపోతే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. కానీ రైస్ ను నెలంతా తినకపోవడం వల్ల ఆ నెలలోనే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకసారి అన్నం తినడం మొదలుపెడితే గ్లూకోజ్ లెవల్స్ మళ్లీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్నం తినడం నివారించడం వలన బి విటమిన్లు మరియు బియ్యం నుండి కార్బోహైడ్రేట్లు అందించే కొన్ని మినరల్స్ లోపాలను కలిగిస్తుంది. కానీ ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. రైస్ ను సరైన పద్ధతిలో కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఫైబర్ ను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మంచిగా ఉంటుంది. బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు, ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ అనేది మన ఆహారపు అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం, అది లేకపోతే మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు.
వైట్ రైస్ తినకపోతే మన శరీరానికి తక్కువ పోషకాహారం అందుతుంది. శరీరం బలహీనపడటం మరియు జీర్ణక్రియ సమస్యలు ఉంటాయి. అందువల్ల, మన అవసరాన్ని బట్టి బియ్యం తీసుకోవాలి. కానీ పూర్తిగా తినకపోవడం మంచిది కాదు.హోల్ గ్రెయిన్ రైస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా తృణధాన్యాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత తగ్గిస్తాయని వెల్లడించింది.మొత్తం ఆహార జాబితా నుండి అన్నం తొలగించడం మంచి విధానం కాదు. అన్నం మితంగా తీసుకోవాలి. అన్నంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మరియు కూరగాయలను జోడించడం ద్వారా మనం దానిని మరింత పోషకమైన భోజనంగా మార్చుకోవచ్చు.