మనం వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలు ఘాటైన వాసనను, రుచిని కలిగి ఉంటాయి. వంటల్లో వీటిని వాడడం వల్ల వంటలు మరింత రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే లవంగాలు ఎన్నో ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రోజూ రెండు లవంగాలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు లవంగాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో కలిగే అద్భుతమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ రెండు లవంగాలను తీసుకోవడం వల్ల జుట్టు పొడువుగా, ఒత్తుగా పెరుగుతుంది. లవంగాలల్లో జింక్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి.
అలాగే లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అదే విధంగా లవంగాలను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించడంతో పాటు దంతాలు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన, దంతాల నొప్పులు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అదే విధంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా లవంగాలు మనకు దోహదపడతాయి. లవంగాలను వాడడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, అజీర్తి, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి.
లవంగాలను నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల అలాగే వంటల్లో వాడడం వల్ల పొట్ట సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో కూడా లవంగాలు మనకు సహాయపడతాయి. లవంగాలల్లో విటమిన్ ఎ,సి, ఇ తో పాటు ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరిచి, కంటి సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడతాయి. అదే విధంగా లవంగాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రాంకైటిస్, ఆస్థమా వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.
అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. లవంగాలను తీసుకోవడం వల్ల వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. ఈ విధంగా లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.