Foods : మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా దాని ప్రభావం ఇతర అవయవాలపై కూడా పడుతుంది. కనుక అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను ఒక్కో అవయవానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి. దీంతో అన్ని రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఇవి అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఏ అవయవం కోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు చురుగ్గా పనిచేయాలంటే వాల్ నట్స్ తినాలి. ఇవి అచ్చం మెదడును పోలి ఉంటాయి. కనుక వాల్ నట్స్‌ను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ గుప్పెడు వాల్ నట్స్‌ను తినాలి. ఇక వంటనూనె తయారీకి ఉపయోగించే ఆలివ్స్ చూసేందుకు అచ్చం స్త్రీలలో అండాశయాలను పోలి ఉంటాయి. కనుక ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. నెల నెలా అండాలు సరిగ్గా విడుదల అవుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. అలాగే హార్మోన్లు కూడా సక్రమంగా పనిచేస్తాయి.
ఇక చిలగడదుంపలు అచ్చం క్లోమగ్రంథిని పోలి ఉంటాయి. కనుక వీటిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ దుంపలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే బొప్పాయి పండ్లను నిలువుగా కోస్తే అచ్చం మన జీర్ణాశయం లాగే ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండ్లను తరచూ తినాలి. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే బొప్పాయి పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే ఆయా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి జీర్ణ సమస్యలకు బొప్పాయి చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు.
ఇక క్యారెట్లను అడ్డుగా చక్రాల్లా కోస్తే కళ్లను పోలి ఉంటాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యం కోసం క్యారెట్లను తినాలి. క్యారెట్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ క్యారెట్లను తింటుండాలి. చివరిగా గుండె.. గుండె నిర్మాణం అచ్చం ద్రాక్ష పండ్లలా ఉంటుంది. కనుక ద్రాక్ష పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ద్రాక్ష పండ్లను తినాలి.
ఇలా మన శరీరంలో భిన్నమైన అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు భిన్నమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.